Home » “విక్రమార్కుడు” లాంటి బ్లాక్ బస్టర్ ను రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా..? ఆ సినిమా గనక చేసి ఉంటే…!

“విక్రమార్కుడు” లాంటి బ్లాక్ బస్టర్ ను రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా..? ఆ సినిమా గనక చేసి ఉంటే…!

by AJAY
Ad

రాజమౌళి తో సినిమా చేసేందుకు ప్రస్తుతం బాలీవుడ్ హీరోలు క్యూ కడుతున్నారు. ఒక్క సినిమా చేసి పెడితే ఎంత ఇవ్వడానికి అయినా నిర్మాతలు సిద్దం అవుతున్నారు. అయితే అలాంటి జక్కన్న ఒక్కప్పుడు సినిమా చేస్తామని వచ్చినా కొంతమంది స్టార్ హీరోలు మిస్ చేస్తున్నారు. అలా చాలా సినిమాలు ఉన్నాయి. జక్కన్న సై సినిమాను ఉదయ్ కిరణ్ హీరోగా తెరకెక్కించాలని అనుకున్నారు.

Advertisement

కానీ ఉదయ్ కిరణ్ అప్పుడు బిజీ షెడ్యుల్ వల్ల సై సినిమా చేయలేకపోయారు. ఇక జక్కన్న కెరీర్ లో అతిపెద్ద హిట్స్ లో విక్రమార్కుడు సినిమా కూడా ఒకటి అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తో రాజమౌళి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

Advertisement

సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన రవితేజ ప్రేక్షకులను మెప్పించారు. సినిమాలో రవితేజ హీరోయిజం ఓ రేంజ్ లో ఉంటుంది. విలన్ లను రవితేజ చితకబాదే సీన్ లు హైలెట్ గా ఉంటాయి. అంతే కాకుండా తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ కూడా సినిమాలో కన్నీళ్లు పెట్టించేలా ఉంటాయి. అయితే జకన్న. ఈ సినిమా కథను మొదట పవన్ కళ్యాణ్ కు వినిపించాడట. కానీ పవన్ కళ్యాణ్ అప్పుడు వేరే సినిమాలతో ఫుల్ బిజీ గా ఉండటం వల్ల రిజెక్ట్ చేశారట.

ఈ వార్త తెలిసిన పవన్ అభిమానులు పవన్ గనక ఈ సినిమా చేసి ఉంటే మరో లెవల్ లో ఉండేది అని అభిప్రాయపడుతున్నారు. అయితే పవన్ కేలవం ఈ సినిమానే కాదు అతడు సినిమా కు కూడా మిస్ చేసుకున్న సంగతి తెలిసిందే. మొదట త్రివిక్రమ్ అతడు కథను పవన్ కు వినిపించగా కథ చెబుతున్న సమయం లోనే పవన్ నిద్రలోకి జారుకున్నారు. దాంతో త్రివిక్రమ్ అక్కడ నుండి వెళ్లిపోయారట.

Visitors Are Also Reading