Home » ఆ సమయంలో నాన్న జేబులో 200 ఉన్నాయట.. ఆకాష్ పూరి కామెంట్స్ వైరల్..!

ఆ సమయంలో నాన్న జేబులో 200 ఉన్నాయట.. ఆకాష్ పూరి కామెంట్స్ వైరల్..!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ల లో ఒకరిగా పేరు పొందిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆయన సినిమా ఇండస్ట్రీలో రాణించడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. వరుసగా మూవీస్ ప్లాప్ అవుతుంటే ఒక ప్రాజెక్టు తర్వాత మరో ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకురావడానికి ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా పూరి పేరు మాత్రం స్టార్ డైరెక్టర్ హోదాలోనే కొనసాగుతోంది. ఇదే పురికి ఉన్నటువంటి ప్రత్యేకత. పూరి జగన్నాథ్ ఆయన కొడుకును కూడా హీరో చేయడానికి ఏ మాత్రం సపోర్ట్ చేయడం లేదు. జస్ట్ ఒక ఫాదర్ ఎలా ఉంటారో ఆ విధంగానే బిహేవ్ చేస్తున్నారు. ఆకాష్ తన సినిమా కథను తాను వినాల్సిందే. తన ప్రాజెక్టుల విషయంలో తన నిర్ణయమే ఫైనల్ చేసుకోవాల్సిందే. మొత్తానికి తాను ఇండస్ట్రీలో ఎదకడానికి సొంతంగా ప్రయత్నాలు చేయాల్సిందే అని చెప్పేసి, పూరి ఏ మాత్రం సపోర్ట్ చేయడం లేదు.

తన తండ్రి మనసును అర్థం చేసుకున్నటువంటి ఆకాష్ తన టాలెంట్ ని ఎలాగైనా నిరూపించుకొని తండ్రి పేరు నిలబెట్టాలని విభిన్నమైన కథలతో స్టార్ హీరోగా ఎదిగడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన తాజా చిత్రం చోర్ బజార్ ఈనెల 24వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ మధ్యకాలంలో పూరి ఆయన భార్యకు విడాకులు ఇస్తానని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై ఆకాష్ తాజాగా ఇంటర్వ్యూ లో స్పందిస్తూ ఒకానొక సమయంలో మా డాడి కుక్కలకు కూడా ఫుడ్ పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటిని తన ఫ్రెండ్ కి ఇచ్చారు. ఇలాంటి కష్టాలు మాకు ఏమీ తెలియకుండా మా అమ్మ మా నాన్న మమ్మల్ని పెంచారు.

Advertisement

Advertisement

మా అమ్మ ఈ విషయాలను ఎప్పుడు కూడా మాకు తెలియనిచ్చేది కాదు. డాడీకి ఎప్పుడూ సపోర్ట్ గా నిలుస్తూ ఉండేది అమ్మనే. అలాంటి వారు ఎందుకు విడాకులు తీసుకోవాలి అనుకుంటారు. మా నాన్న ఒక సందర్భంలో నాకు ఒక విషయం చెప్పారు. మా మమ్మీ,డాడీ ప్రేమలో ఉన్నప్పుడు, మా నాన్న మమ్మీ కి కాల్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను వచ్చేస్తావా.. అని అడిగారట, ఆ సమయంలో నా జేబులో రెండు వందలు ఉన్నాయి.. అవి కూడా రేపు ఉంటాయో ఉండవో కూడా తెలియదు అని చెప్పారట. అయినా మా అమ్మ ఆయన మాటకు ఓకే చెప్పి వచ్చేసింది. అంత ప్రేమ ఉన్నటువంటి అమ్మానాన్నలు ఏవిధంగా విడిపోతారు.. అవన్నీ ఉట్టి పుకార్లే అని చెప్పుకొచ్చారు ఆకాశ్..

also read;

చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న ‘కీర్తి సురేష్’ వాళ్ళ అమ్మ చిరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా గురించి తెలుసా ?

రాజమౌళి చిన్నప్పటి పేరేంటో తెలుసా ? జక్కన్న అమ్మ గారి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా ? వేల‌ కోట్లకి వారసురాలు..!

 

Visitors Are Also Reading