Home » రాజమౌళి తల్లి అలా చనిపోయారా ? వింటుంటే కనీళ్ళు రాకుండా ఉండవు…!

రాజమౌళి తల్లి అలా చనిపోయారా ? వింటుంటే కనీళ్ళు రాకుండా ఉండవు…!

by AJAY
Ad

దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి సిద్ధమవుతున్నారు. ఇక రాజమౌళి చేస్తున్న సినిమాలకు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ ను అందిస్తార‌న్న‌ సంగతి తెలిసిందే. త్వరలో పట్టాలెక్క‌బోతున్న‌ మహేష్ బాబు సినిమాకు కూడా విజయేంద్ర ప్రసాద్ గారే కథను సిద్ధం చేస్తున్నారు. అయితే విజయేంద్రప్రసాద్ గురించి అందరికీ తెలుసు….. కానీ రాజమౌళి తల్లి గురించి మాత్రం అతి తక్కువ మందికి తెలుసు. రాజమౌళి తల్లి పేరు రాజనందిని కాగా విజయేంద్రప్రసాద్ ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు.

Advertisement

ఓ ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ తమ ప్రేమ, అనుబంధం గురించి తెలిపారు. తాను తన భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాన‌ని విజయేంద్రప్రసాద్ చెప్పారు. తాను కమ్మ కులానికి చెందిన వాడినని కానీ తన భార్య ఏ కులానికి చెందిన‌వారో త‌న‌కు పెళ్లయ్యాక చాలా కాలం వ‌ర‌కూ తెలియదని అన్నారు. కానీ పెళ్లి తర్వాత వాళ్లు కాపు కులానికి చెందిన వారని తెలిసిందన్నారు. తన భార్య రాజనందిని చివరి రోజుల్లో నరకం అనుభవించార‌ని చెప్పారు. స్ట్రోక్ రావడం తో ఆమె కోమాలోకి వెళ్లి పోయిందని అన్నారు.

Advertisement

Rajamouli

Rajamouli

దాంతో కొన్ని నెలల పాటు ఆమెకు ఇంటి వద్దనే చికిత్స అందించామని చెప్పారు. ఇంట్లోనే ఓ గదిని ఆసుపత్రిలా మార్చి డాక్టర్లను పిలిపించి చికిత్స చేయించినట్లు చెప్పారు. ఆ సమయంలో ఆమె కోలుకుంటే పూర్తిగా కోలుకోవాలని….లేదంటే వెళ్లిపోవాలని తాను కోరుకున్నట్టు చెప్పారు.

తాము ఎంతో ప్రయత్నించినా చివరికి ఆమె చనిపోయార‌ని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తన కొడుకు రాజమౌళి కలిసి తీసిన బాహుబలి సక్సెస్ ను ఆమె చూసి ఉంటే బాగుండేదని అన్నారు. ఆమె ఎక్కడ ఉన్నా బాహుబలి సక్సెస్ ను చూసి ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. తన భార్యను గుర్తుచేసుకుని చాలాసార్లు కన్నీళ్లు పెట్టుకున్నా అంటూ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఎమోష‌నల్ అయ్యారు.

Visitors Are Also Reading