Home » హీరో బాలకృష్ణను స్టార్ గా మార్చింది ఆ సెంటిమెంటేనా..?

హీరో బాలకృష్ణను స్టార్ గా మార్చింది ఆ సెంటిమెంటేనా..?

by Sravanthi
Ad

నందమూరి బాలకృష్ణ ను తిరుగులేని స్టార్ గా మార్చిన సినిమా ముద్దుల మామయ్య. బాలకృష్ణ, డైరెక్టర్ కోడి రామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన 5వ చిత్రం ఇది. ప్రతి ఏడాది బాలకృష్ణ పుట్టిన రోజున ఏదో ఒక కార్యక్రమం నిర్వహించడం ఆయనకు అలవాటు. అందుకే 1988జూన్ 10న బాలయ్యతో కొత్త సినిమా మొదలుపెట్టారు గోపాల్ రెడ్డి. ఇందులో హీరో మొదట్లో దొంగ, తర్వాత మంచివాడిగా మారతాడు. కథ ఏంటో కూడా తెలియకుండా ఆయన మీద నమ్మకంతో డేట్స్ కూడా ఇచ్చేసారు బాలకృష్ణ. విజయశాంతిని హీరోయిన్ గా అనుకున్నారు.

Advertisement

బెంగళూరు, మైసూరు లో కొన్ని సీన్స్ తీసిన పూర్తి కథ సిద్ధం కాకపోవడంతో గోపాల్ రెడ్డి మనసులో అసంతృప్తి. తమిళం లో అన్నా, చెల్లెల్ల సెంటిమెంట్ తో రిలీజ్ అయిన ఎన్ తంగచ్చి పడిచ్చివా సినిమా గోపాల్ రెడ్డి కి బాగా నచ్చి వెంటనే బాలకృష్ణ కు,కోడి రామకృష్ణ కు చూపించడంతో వాళ్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో తమిళ సినిమా రీమేక్ హక్కులను దక్కించుకున్నారు గోపాలరెడ్డి.

Advertisement

అప్పటివరకు బాలకృష్ణ తో తీసిన సీన్స్ పక్కనపెట్టి గణేష్ పాత్రతో సంభాషణలు రాయించారు. గోపాల రెడ్డికి మా అనే అక్షరం సెంటిమెంట్. అందుకే ఈ సినిమాకి ముద్దుల మామయ్య అనే టైటిల్ నిర్ణయించారు. ఇందులో హీరోతో సమానంగా ఉండే చెల్లెలు పాత్ర ఉంది. ఆ పాత్రకు నటి సీతను ఎన్నుకున్నారు. 90 లక్షల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను కోటి 40లక్షలకు అమ్మారు. 1989 ఏప్రిల్ 7న విడుదలైన ముద్దుల మామయ్య సూపర్ హిట్ అయింది. మాస్ హీరోగా బాలయ్య తన స్థానం సుస్థిర పరచుకున్నారు.

also read;

చిరంజీవితో విజయశాంతి 20 ఏళ్లుగా ఎందుకు మాట్లాడకుండా ఉన్నారో తెలుసా ? ఆ విషయంలో చిరు…!

వావ్.. ప్ర‌భాస్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్ కాంబినేష‌న్ ఎలా ఉంటుందో ఈ ట్రైల‌ర్‌తోనే తెలిసిపోయింది..!

 

Visitors Are Also Reading