అప్పటి సినిమాలు అందులో ఉండే స్పెషల్ సాంగ్ లు, వాటిలో నటించే నటీనటుల గురించి, ఇప్పటి సినిమాలు వీటిలో వచ్చే స్పెషల్ సాంగ్ లు నటీనటుల గురించి ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేసింది సింగర్ ఎల్ ఆర్ ఈశ్వరి.. మరి అదేంటో ఒకసారి చూద్దాం..?
‘ఐటమ్ సాంగ్స్’ని ఇప్పుడంటే వీటికి నామకరణం జరిగింది. పాపం, వాటిని కూడ నాయికలే కొట్టేయడం మామూలైంది కాని, ఒకానొకప్పుడు వాటిని, ఆడేవాళ్ళ పాటలనేవారు, అంటే, యల్.విజయలచ్మి పాట, జోతిలచ్మి పాట, జైమాల్నిపాట… అట్టా పిలిచేవారు.ఆపాటలకి పాడటానికీ, డాన్స్ ఆడటానికీ కూడ ప్రత్యేకులుండే వాళ్ళు.
Advertisement
వారి సమ్మేళనాలు కూడా అలానే ఆకట్టుకునేవి అభిమానులని. ‘ప్రేమనగర్’ సినిమా అనగానే, నాకు బాఘా గుర్తు కొచ్చేది. ‘ల్లేల్లేనా రాజా’ తప్ప, నాయికా నాయకుల ప్రేమగీతాలు కాదు. పాట విన్నాక ‘జోతిలచ్మి’ డాన్సాడిందో,డాన్సు చూసేక ‘యల్లారీశ్వరి’ స్వరం అలా వొణికిందో చెప్పడం కష్టం.అంత పాలూ,తేనే మాదిరి కల్సి పోయి నయ్, ఆటాపాటా. ఇంకా చిత్రీకరణకొస్తే ఏంటబ్బా, ‘జోతిలచ్మి’ ఇంతపెద్ద గౌనులాంటి దేసుకుందని మనం పూర్తిగా అశ్చర్య పొయేలోపే, అది విప్పి అవతల పారేసి, పహిల్వాన్ మాదిరి కళ్ళనిండా తన అందాలను, జడలు విప్పిన వూడలమర్రిలా ఊగిపోతూ ‘ల్లేల్లేల్లే’ అని నొక్కినొక్కి లేపుతుంటే, నాయకుడి కన్నా ముందుగా హాల్లోని ఆవిడ అభిమానులు లేచేస్తారు. ఈలలు వేసేవారు.
Advertisement
దింతో నాయకుడు కూడా చచ్చినట్టు లేచి, ‘తాగున్నా’ గుర్తుగా కళ్ళు తేలవేస్తూ, ఆవిడ బుల్లిగౌనులాంటి ఎర్రటి మూతితో పాటందుకుంటాడు. ఇంకావిడ రెచ్చిపోయి పూనకం వచ్చిన దానిలా, విరబోసుకున్న బారెడు జుట్టునీ యిష్టమోచ్చినట్టు ఎగరేసుకుంటూ ఆడుతోంటే.. చూసే వాళ్లు గుక్క కూడా తిప్పుకోలేరు. ఆడుతోనే నేల మీద చతికిల పడిన అతగాడిని చేయట్టుకు లాగుతోంటే, అట్టా ఆ గదంతా యీడుస్తుందేమో, అని మనతో పాటు, హీరోగారికి కూడా భయమేసేట్టు వుంటుంది. ఈ గోలంతా ఎక్కడో కూర్చున్నా నాయిక వింటూ,చిరాకు పడుతుంటుంది. చివరికి నాయిక వుండబట్టలేక లేచి డింగూడింగూమని నడుచుకుంటూ వొచ్చి, మంచీమరేద లేకుండా గది కిటికీలోంచి చూస్తుంది.
హు, తనకి అట్టా రాదు, వేసేవాళ్ళని వెయ్యనీదు. సిన్మాల్లో ఈరోయిన్లు ఎప్పుడూ యింతే, ఏంటోమరి..?! ఇట్టాంటి పాటలు ఆట్టానికి, పాట్టానికి ఆడవాళ్లు కావాలి కాని, ఆటిమీద ఆడాళ్ళకి మాత్రం యిష్టముండ కూడ దంటే, నేనొప్పుకోనబ్బా..! కాలేజీలో వున్నప్పుడు మా మిత్రులు నవ్వేవారు, నాకు ఎల్.ఆర్.. ఈశ్వరంటే యిష్టమని కొన్ని రకాల పాటలు ఆమె మాత్రమే పాడాలి. ఆ గొంతులో గమ్మత్తైన మత్తు,వొణుకు, విరుపు. మరెవ్వరికీ రావు, రాలేవు.!!సరదాగా మీరూ వినండి, చూస్తూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి.
also read;
లక్ష్మి పార్వతి మొదటి భర్త టీడీపీ కోసం ఎటువంటి పనులు చేసేవారో తెలుసా ?
అదిరే అభికి షూటింగ్‌లో ప్రమాదం.. అసలు ఏమి జరిగిందంటే..?