ప్రముఖ తెలుగు నటుడు, సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర దర్శకుడు టి.కృష్ణ కుమారుడు గోపిచంద్. తొలివలపు చిత్రంతో తన సినీ ప్రస్థానమును ప్రారంభించాడు. ఆ తరువాత జయం, నిజం, వర్షం వంటి సినిమాల్లో విలన్ పాత్రలను పోషించాడు. ఇక ఆ తరువాత మళ్లీ కథానాయకుడిగా నిలదొక్కుకున్నాడు. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ప్రేక్షకులను కొత్త కథలతో ఎంటర్‌టైన్ చేయడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు గోపిచంద్. నటన, అభినయంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కమర్షియల్ సినిమాలకు పెద్ద పీఠ వేస్తూనే మధ్య మధ్యలో కంటెంట్ సినిమాలను చేస్తున్నాడు.
Advertisement
ఇదిలా ఉండగా.. గోపిచంద్ జయం సినిమాలో విలన్ గా చేసిన విషయం విధితమే. తేజ దర్శకత్వంలో నితిన్, సదా జంటగా నటించిన ఈ మూవీ భారీ విజయం సాధించింది. ఇక జయం సినిమా నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. తన మొదటి సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో నితిన్ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ అయ్యాడు. యాదృశ్చికంగా గోపిచంద్ ప్రస్తుతం తన కొత్త సినిమా పక్కా కమర్షియల్ ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో జయం సినిమా గురించి ప్రస్తావించారు.
Advertisement
తన తొలి పారితోషికం జయం సినిమాకు తీసుకున్నానని చెప్పుకొచ్చాడు గోపిచంద్. నా సంపాదన జయం సినిమాతోనే ప్రారంభమైంది. నేను జయం సినిమాకు రూ.11వేలు పారితోషికం తీసుకున్నానని.. ఆ డబ్బులతో మా అమ్మకు ఇచ్చాను. అయితే కరెక్ట్‌గా రూ.11వేలు మాత్రమే ఎందుకు ఇచ్చారంటే డైరెక్టర్ తేజ లక్కి నెంబర్ 11 అందుకే నాకు అంతే ఇచ్చారు. ఇక ఆ తరువాత నేను ఎదిగాక చాలా మంది నా వద్దకు డబ్బు తీసుకున్నారు. కొంత మంది తిరిగిచ్చారు. మరికొంత మంది ఇవ్వలేదు. వారి పరిస్థితి బాగాలేదని వదిలేస్తాను. కానీ కమర్షియల్ గా ఆలోచించి వారిని వేధించలేదని చెప్పుకొచ్చాడు. జులై 01న పక్కా కమర్షియల్ సినిమా విడుదల కానుంది. హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్ కు ఈ సినిమా ద్వారా హిట్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి మరి.
Also Read :
Sr ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి కోల్పోతే కృష్ణ పత్రికా ప్రకటన ఎందుకు ఇచ్చారు…?
ఒకప్పటి హీరోయిన్ టబు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ హీరో అని తెలుసా ?