Home » Sr ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి కోల్పోతే కృష్ణ పత్రికా ప్రకటన ఎందుకు ఇచ్చారు…?

Sr ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి కోల్పోతే కృష్ణ పత్రికా ప్రకటన ఎందుకు ఇచ్చారు…?

by AJAY
Ad

తెలుగు దేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ సీఎం గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 1983 లో ముఖ్యమంత్రి గా ఎన్నికైన ఎన్టీఆర్ 1984 లో గుండె ఆపరేషన్ కోసం ఢిల్లీకి వెళ్లారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీలో చీలికలు ఏర్పడ్డాయి. నాదెండ్ల భాస్కరరావు కొంత మంది ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. గుండె ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ కు 16 వారాలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు.

Advertisement

కానీ ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాత తాను విశ్రాంతి తీసుకో కూడదు అని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. గుండె ఆపరేషన్ చేయించుకుని ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన రెండు రోజుల తర్వాతనే అప్పటి గవర్నర్ రామ్ లాల్ ఎన్టీఆర్ ను బర్తరఫ్ చేశారు. ఎన్టీఆర్ కి శాసనసభలో సరైన మెజారిటీ లేదని కాబట్టి ఆయన రాజీనామా చేయాలని ఓ లేఖను రాశారు. కానీ ఎన్టీఆర్ మాత్రం రాజీనామా చేసేందుకు నిరాకరించారు.

 

Advertisement

దాంతో గవర్నర్ చేసేదిలేక ఎన్టీఆర్ ను బర్తరఫ్ చేశారు. అంతేకాకుండా కొత్త ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కరరావు చేత గవర్నర్ ప్రమాణస్వీకారం కూడా చేయించారు. అయితే ఈ తతంగంలో గవర్నర్ పాత్ర కూడా ఉందని వార్తలు వినిపించాయి. గవర్నర్ రాంలాల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అంతేకాకుండా నాదెండ్ల కూడా గతంలో కాంగ్రెస్ లో పని చేశారు. దాంతో నాదెండ్లకు సపోర్ట్ గా నే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని సైతం అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. మరోవైపు రాష్ట్రం లో ఆందోళనలు నిరసనలు మొదలయ్యాయి.

ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి లోనే కూర్చోబెట్టాలని ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మోహన్ బాబు, కృష్ణంరాజు ఎన్టీఆర్ కు సపోర్ట్ చేస్తూ పేపర్ ప్రకటనలు ఇచ్చారు. అయితే అలాంటి సమయంలోనే సూపర్ స్టార్ కృష్ణ మాత్రం నాదెండ్ల మనోహర్ కు అభినందనలు తెలుపుతూ పేపర్ ప్రకటన ఇచ్చారు. సమర్ధుడు పరిపాలనాదక్షత కలిగిన నాదెండ్ల భాస్కరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఎన్నికైనందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వారధి కావాలని దాంతో రాష్ట్ర అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నట్లు కృష్ణ ప్రకటనలో పేర్కొన్నారు. దాంతో ఎన్టీఆర్ అభిమానులు, కొంతమంది ప్రజలు కృష్ణ ను విమర్శించడం మొదలుపెట్టారు. ఆ మరుసటి రోజే కృష్ణ తాను ప్రజల మనిషిని అని పార్టీల మనిషిని కాదు అని వివరణ ఇస్తూ మరో ప్రకటన కూడా చేశారు.

Visitors Are Also Reading