బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు వస్తూ పోతూ ఉన్నారు. కానీ కొంత మంది మాత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంటారు. అలాంటి యాంకర్లలో ఉదయభాను కూడా ఒకరు అని చెప్పవచ్చు. ఈమె ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కడా కనిపించడం లేదు. ఒకప్పుడు మాత్రం ఎక్కువగా చూసిన ఉదయభాను కార్యక్రమాలు, షోలు వంటివి కనిపించేవి. అన్ని రకాల కార్యక్రమాలు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఆమె వెండితెర నటిగా కూడా ఎన్నో చిత్రాల్లో అలరించింది.
Advertisement
కానీ అకస్మాత్తుగా బుల్లితెరపై ఉదయభాను కెరీయర్ మూగబోయిందనే చెప్పవచ్చు. అయితే అప్పట్లో ఉదయభాను స్టార్ యాంకర్‌గా కొనసాగిన ఉదయభాను ప్రస్తుతం ప్రేక్షకులు కావాలనే ఈమెను దూరం చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె కనుమరుగు కావడానికి కారణం ఏమిటని ఆమె అభిమానులు సైతం ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. అందానికి అందం, అభినయం ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా ఉదయభాను కనిపించకుండాపోయారు.
Advertisement
బుల్లి తెరపై యాంకర్‌గా చేస్తున్న సమయంలో సినిమాల్లో అవకాశాలు రాగానే ఆమె మనసు అటువైపు వెళ్లిందని దాంతో ఈమె కెరీర్ ఇలా అయిందన్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరికొంతమంది మాత్రం ఈమె స్టార్ యాంకర్‌గా ఎదగడం చూసి ఓర్వలేక ఆమె గురించి పలురుమార్లు క్రియేట్ చేసి అవకాశాలు రాకుండా చేశారని కూడా టాక్ వినిపించింది. అవకాశాలు రాక మానసికంగా కుంగిపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కున్నట్టు ఆమె సన్నిహితులు పేర్కొన్నట్టు సమాచారం. ఈ మధ్యకాలంలో ఈమె గురించి పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. బుల్లితెరపై ఒక వెలుగు వెలగాల్సిన ఉదయభాను సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైందని అన్నట్టుగా తెలుస్తోంది. ఈమె ఎక్కువగా వైవాహిక జీవితానికి ప్రాధాన్యతనిస్తుంది. తాజాగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించినట్టు తెలుస్తోంది.
Also Read :
చెన్నైలో రెండున్నరేళ్ల పాటు ప్రదర్శించబడిన తెలుగు సినిమా ఏదో తెలుసా..?
యూపీఐ మోసాలను అరికట్టేందుకు మీ కోసం ఈ 5 చిట్కాలు