Home » యూపీఐ మోసాల‌ను అరిక‌ట్టేందుకు మీ కోసం ఈ 5 చిట్కాలు

యూపీఐ మోసాల‌ను అరిక‌ట్టేందుకు మీ కోసం ఈ 5 చిట్కాలు

by Anji
Ad

యూపీఐ అన‌గా యునైటేడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్‌. ఇది ఒక వ్య‌క్తి యొక్క బ్యాంకు ఖాతాల‌ను ఒకే మొబైల్ అప్లికేష‌న్ లో ఏకీకృతం చేసి ఆన్‌లైన్‌లో డ‌బ్బులు బ‌దిలీ చేసేందుకు అనుమ‌తించే కేంద్రీకృత వ్య‌వ‌స్థ‌. ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఈ యూపీఐ లావాదేవీల‌పై ఆధార‌ప‌డుతుండ‌డంతో సైబ‌ర్ నేర‌గాళ్లు ఆన్‌లైన్ ద్వారా యూపీఐ మోసాల‌కు తెర‌లేపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిట‌ల్ ప్ర‌పంచంలో యూపీఐ మోసం ముప్పుగా మారింది. భార‌త‌దేశంలో యూపీఐ మోసం నుంచి మిమ్మ‌ల్ని మీరు ర‌క్షించుకోవ‌డానికి ఈ 5 చిట్కాల‌ను మీకు అందిస్తున్నాం.


యూపీఐ పిన్ : 

Advertisement

యూపీఐ పిన్‌ను అస‌లు ఎవ‌రితో కూడా మీరు షేర్ చేసుకోకూడ‌దు. ప్ర‌భుత్వ లేదా బ్యాంకు అధికారులం అని చెప్పుకునే వారితో మీ బ్యాంకు ఖాతాకు యాక్సెస్ కోల్పోవ‌డం లేదా నెంబ‌ర్ అప్‌డేట్ చేయ‌డం వంటి మెస్సేజ్‌లు ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా స‌ర్వ‌సాధార‌ణం అయిపోయాయి. జాగ్ర‌త్త‌గా వ‌హించండి. ఎవ‌రైనా మీ యూపీఐ పిన్ కోసం అడుగుతుంటే వారు మోసగాళ్లు కావ‌చ్చు.

యూపీఐ పిన్ మార్పు : 

ప్ర‌తి ఒక్క‌రూ క్ర‌మం త‌ప్ప‌కుండా యూపీఐ పిన్‌ను మార్చుకోవాలి. నెల‌వారి కాక‌పోతే క‌నీసం త్రైమాసికం ప్రాతిప‌దిక‌న అయినా మీ యూపీఐ పిన్‌ను మార్చుకోవ‌డం బెట‌ర్‌.

Advertisement

యూపీఐ లావాదేవి ప‌రిమితి : 

 

త‌ప్ప‌నిస‌రిగా మీరు మీ మొబైల్ యాప్‌ని ఉప‌యోగించి రోజువారి యూపీఐ లావాదేవి ప‌రిమితిని సెట్ చేయాలి. ఖాతా హ్యాక్ చేయ‌బ‌డిన‌ప్ప‌టికీ మోస‌గాళ్లు మీ ఖాతా నుంచి అద‌న‌పు డ‌బ్బును ఉప‌సంహ‌రించుకోకుండా ఇది స‌హాయ‌ప‌డుతుంది.

మొబైల్ భ‌ద్ర‌త :

మీ మొబైల్ ఫోన్‌ను లాక్ చేసి ఉంచడం బెట‌ర్‌. ఎట్టి ప‌రిస్థితిలోనూ మీ ఫోన్‌ను గుర్తు తెలియని వ్య‌క్తికి లేదా ఏదైనా సంస్థ ప్ర‌తినిధిగా చెప్పుకునే వారికి అస్స‌లు ఇవ్వ‌కూడ‌దు. ఎలాంటి సంస్థ ప్ర‌తినిధులైన మిమ్మ‌ల్ని మొబైల్ అడ‌గ‌రు.

స‌ర్పింగ్ చేస్తున్న‌ప్పుడు సుర‌క్షితంగా ఉండాలి : 

కొన్నిసార్లు మీరు రివార్డును అందుకోవ‌డం కోసం ఏదైనా తెలియ‌ని వెబ్‌సైట్‌లో లాగి అయి డ‌బ్బును బ‌దిలి చేయాల్సి రావ‌చ్చు. అప్పుడు వెబ్‌సైట్ ప్రామాణిక‌త గురించి మీకు తెలిస్తే మాత్ర‌మే ఆన్‌లైన్ చెల్లింపులు చేయాలి.

Also Read : 

Chanakyaniti : ఈ విష‌యాల‌ను ఇత‌రుల‌తో పంచుకుంటే మీకు స‌మ‌స్య‌లు అధికం అవుతాయట‌..!

“లేడీస్ టైలర్” సినిమా గురించి డైరెక్టర్ వంశీ ఏమన్నారంటే..?

 

Visitors Are Also Reading