Home » నయనతార విగ్నేష్ శివన్ ల పెళ్లి పత్రిక చూస్తే ఫిదా అవుతారు..?

నయనతార విగ్నేష్ శివన్ ల పెళ్లి పత్రిక చూస్తే ఫిదా అవుతారు..?

by Sravanthi
Ad

తెలుగు తమిళ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేస్తూనే, విలక్షణమైన పాత్రలతో అదరగొడుతోంది నయనతార. ప్రస్తుతం తెలుగు తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఈమె కూడా ఒకరు అని చెప్పవచ్చు. అయితే ఈ అమ్మడు గత కొద్ది రోజుల నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో ఇరువురు కుటుంబ సభ్యుల మధ్య 2021లో వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. దీంతో ఈ రోజు ఉదయం 8:30 కు మహాబలిపురంలో నయన్ మరియు విగ్నేష్ వివాహం ఘనంగా జరిగింది. మహాబలిపురం లో అత్యంత సన్నిహితుల మధ్య వీరిద్దరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా పూర్తయింది. ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వీరిద్దరి పెళ్లి పత్రిక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో లేడీ సూపర్ స్టార్ నయనతార జంటకు ఎంతోమంది అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ వివాహ వేడుకకు హీరో విజయ్ సేతుపతి, రజినీకాంత్, కార్తీ, సమంత తో సహా నయనతార పెళ్ళికి హాజరై వధూవరులను ఇద్దరిని దీవించారు. దాదాపుగా ఆరు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న వీరు చివరికి ఒక్కటై పెళ్ళితో కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. గతేడాది మార్చిలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. అప్పటి నుంచి వీరి పై ఎన్నో రూమర్స్ వచ్చాయి. వీరిద్దరి వివాహం జరిగిందని నయనతారా ఆల్రెడీ ప్రెగ్నెంట్ అని రూమర్స్ కూడా వచ్చాయి. వీటన్నింటికీ ఈ రోజుతో చెక్ పెట్టినట్టు అయిపోయిందని చెప్పవచ్చు.

ALSO READ;

“విక్రమ్” సినిమాలో నటించిన ఈ బుడ్డోడు ఎవరో తెలుసా…సినిమా ఛాన్స్ ఎలా వచ్చిందంటే…!

బయోపిక్ కు డబ్బులు ఇస్తామన్న “మేజర్” నిర్మాతలు….సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి ఏమన్నారో తెలిస్తే సెల్యూట్ చేయాల్సిందే..!

 

Visitors Are Also Reading