Home » “విక్రమ్” సినిమాలో నటించిన ఈ బుడ్డోడు ఎవరో తెలుసా…సినిమా ఛాన్స్ ఎలా వచ్చిందంటే…!

“విక్రమ్” సినిమాలో నటించిన ఈ బుడ్డోడు ఎవరో తెలుసా…సినిమా ఛాన్స్ ఎలా వచ్చిందంటే…!

by AJAY
Ad

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాసన్ చాలా కాలం నుండి స‌రైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. కాగా తాజాగా ఆయ‌న న‌టించిన విక్ర‌మ్ సినిమాకు సూప‌ర్ హిట్ టాక్ వ‌స్తోంది. ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ తో పాటూ సూర్య, విజ‌య్ సేతుప‌తి, మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ ఫ‌హాద్ ఫ‌జిల్ కూడా ముఖ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించారు. దాంతో ఎన్నో అంచనాల మ‌ధ్య ఈ సినిమా ప్రేక్ష‌కుల మధ్య‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ మ‌రోసారి త‌న న‌ట‌న‌తో మెప్పించారు. ఈ సినిమాకు లోకేష్ క‌న‌క‌రాజ్ దర్శ‌క‌త్వం వ‌హించారు.

Advertisement

ఇక ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ మ‌న‌వ‌డి పాత్ర కూడా ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన సంగ‌తి తెలిసిందే. దాంతో ఆ బుడ్డోడు ఎవ‌రా అని ప్రేక్ష‌కులు ఆరా తీయ‌డం మొదలు పెట్టారు. అంత‌లా ఆ కుర్రాడు ప్రేక్ష‌కుల‌ను మెప్పిచాడు. అయితే ఆ కుర్రోడు ఎవ‌రా అన్న సంగ‌తి ఇప్పుడు తెలుసుకుందాం. విక్ర‌మ్ సినిమాలో బుడ్డోడి పాత్ర కోసం చాలా మందిని ఆడిష‌న్ చేశారు. కానీ చివ‌ర‌గా ద‌ర్శ‌న్ ను సెల‌క్ట్ చేశారు. ద‌ర్శ‌న్ క‌న్న‌త‌ల్లి పేరు అభిన‌య‌….కాగా తాజాగా ఓ ఇంట‌ర్య్వూలో అభిన‌య మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

Advertisement

విక్ర‌మ్ సినిమాలో త‌న బాబును చూసి చాలా ఆనందంగా ఉంద‌ని అభిన‌య వెల్ల‌డించింది. త‌న భర్త కూడా కాస్టింగ్ ఫీల్డ్ లో ప‌నిచేస్తార‌ని అభిన‌య వెల్ల‌డించింది. అంతే కాకుండా త‌న మ‌రిదికి ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ కు మ‌ధ్య మంచి ప‌రిచయం ఉంద‌ని అభిన‌య పేర్కొంది. విక్ర‌మ్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ కోసం ఆడిష‌న్స్ జ‌రుగుతున్న స‌మ‌యంలో త‌మ బాబును కూడా తీసుకుని వెళ్లిన‌ట్టు అభియ‌న తెలిపింది.

అంతే కాకుండా అనుకోకుండా త‌మ బాబు సెలెక్ట్ అయిపోయాడ‌ని తెలిపింది. ఇక ద‌ర్శ‌న్ త‌న క్యూట్ క్యూట్ లుక్స్ తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ ను సొంతం చేసుకుంది. అంత చిన్న వ‌య‌సులోనే త‌న న‌ట‌తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌న్ కు మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తాయా లేదా చూడాలి.

ALSO READ : వైసీపీని నమ్ముకుంటే ఒక్క రూపాయి ఇవ్వలేదు…నేను హర్ట్ అయ్యాను…శ్రీరెడ్డి ఫైర్ …!

Visitors Are Also Reading