Home » టీం ఇండియాకు ఆడాలంటే టాలెంట్, లక్ తో పాటు ఇంకోటి కూడా కావాలంటున్న రైనా..!

టీం ఇండియాకు ఆడాలంటే టాలెంట్, లక్ తో పాటు ఇంకోటి కూడా కావాలంటున్న రైనా..!

by Azhar
Ad

అయితే భారత జట్టుకు ఎంపిక కావడానికి కానీ.. లేక జట్టులోకి వచ్చిన తర్వాత కానీ తమ స్థానం నిలబెట్టుకోవాలంటే టాలెంట్ తో పాటు గా కొంచెం లక్ కూడా కలిసి రావాలని అంటుంటారు చాలా మంది. కానీ టీం ఇండియాకు ఆడాలంటే టాలెంట్, లక్ తో పాటు ఇంకోటి కూడా కావాలంటున్నాడు రైనా. అయితే ప్రస్తుతం భారత జట్టులోకి రచడానికి ఒక్కే ఒక్క మార్గం ఐపీఎల్. మొదట జాతీయ క్రికెట్ లో బాగా రాణిస్తే ఐపీఎల్ లోకి వస్తారు. అక్కడ బాగా రాణిస్తే భారత జట్టులోకి వస్తారు అనేది అందరికి తెలిసిందే.

Advertisement

అయితే ఈ ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ కూడా చాలా మంది యువ ఆటగాళ్లకు అలాగే ఎంపికయ్యారు. ఐపీఎల్ లో రాణించడంతో వారిని జట్టులోకి తీసుకున్నారు సెలక్టర్లు. ఈ నెల 9 నుండి ఈ టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా.. జట్టులోకి వచ్చిన యువ ఆటగాళ్లకు భారత మాజీ అతగాడి మిస్టర్ ఐపీఎల్ గా పేరు తెచుకున్న రైనా కొన్ని కీలక సూచనలు చేసాడు. టీం ఇండియాకు ఆడాలంటే టాలెంట్, లక్ తో పాటు మైండ్ సెట్ కూడా చాలా ముఖ్యం అని చెప్పాడు.

Advertisement

ఐపీఎల్ లో మీరు బాగా ఆడటం వల్లే టీం ఇండియాకు వచ్చారు. కాబట్టి అక్కడ ఆడిన దాని కంటే బాగా ఆడాలి అని అభిమానులు, జట్టు సెలక్టర్లు భావిస్తారు. కానీ ఐపీఎల్ లో ఆడటం భారత జట్టుకు ఆడటం రెండు చాలా వేరు. అక్కడ ఇక్కడ జట్టు వాతావరణ పరిస్థితులు వేరేలా ఉంటాయి. కాబట్టి వాటిని తట్టుకొని ఒత్తిడిని ఎదుర్కోగల మైండ్ సెట్ మీకు ఉంటేనే టీం ఇండియాలో ఎక్కువ రోజులు మీరు కొనసాగగలరు. అయితే నాకు ఈ సిరీస్ లో ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ ఎలా ఆడుతారు అనేది చూడాలని ఉంది. వారు ఈ ఐపీఎల్ లో బాగా రాణించే జాతీయ జట్టులోకి వచ్చారు. అందువాల వారిని ఈ సిరీస్ కు కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ ఎలా ఉపయోగించుకుంటారు అనేది చూడాలని ఉంది అని రైనా పేర్కొనాడు.

ఇవి కూడా చదవండి :

మద్యం మత్తులో రోడ్డు మీద చాహల్, నెహ్రా రచ్చ..!

నా విజయం వెనుక ఉన్నది ఆయనే అంటున్న పాండ్య..!

Visitors Are Also Reading