Home » అర్జున్ బ్యాటింగ్ బాలేదట… అందుకే ముంబైలో అఆడించలేదట..!

అర్జున్ బ్యాటింగ్ బాలేదట… అందుకే ముంబైలో అఆడించలేదట..!

by Azhar
Ad

క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకుగా అర్జున్ టెండూల్కర్ కు మంచి పేరు ఉంది. అలాగే సచిన్ అభిమానులు కూడా అర్జున్ ఆటను ఎప్పుడు ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఇక గత ఏడాది ఐపీఎల్ వేలంలో అర్జున్ ను 20 లక్షలకు కొనుగోలు చేసిన ముంబై జట్టు ఒక్క మ్యాచ్ లో కూడా అవకాశం ఇవ్వలేదు. అలాగే ఈ ఐపీఎల్ మెగవేలంలో కూడా 30 లక్షలు ఖర్చు చేసి తీసుకుంది. అందువల్ల అర్జున్ ఐపీఎల్ అరంగేట్రం తప్పనిసరి అనుకున్నారు. అదే విధంగా ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు దారుణంగా విఫలమైంది.

Advertisement

అందువల్ల ప్లే ఆప్స్ రేస్ నుండి తప్పుకున్న తర్వాత యువ ఆటగాళ్లకు చాలా మందికి అవకాశాలు ఇచ్చింది. కానీ అర్జున్ ను మాత్రం ఆడించలేదు. అయితే ఇప్పుడు తాజాగా ముంబై ఇండైన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ అర్జున్ ను ఎందుకు ఆడించలేదు అనే విషయాన్ని తెలిపాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు తరపున అది సచిన్ టెండ్యూలక్ర్ కొడుకుగా ఎంట్రీ ఇవ్వాలంటే అర్జున్ ఎంతో బాగా రాణించాలి. పైగా అర్జున్ ది ఆల్ రౌండర్ కోటా. కాబట్టి అన్ని విధాలుగా రాణించాలి. అయితే అర్జున్ బౌలింగ్ బాగుంది. కానీ బ్యాటింగ్, ఫీల్డింగ్ మాత్రం బాలేదు.

Advertisement

అర్జున్ ఇంకా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఫీల్డింగ్ లో ఇంకా చురుకుగా మారాలి. అందువల్లే అర్జున్ ను ఈ ఐపీఎల్ లో అందించలేదు. అదే విధంగా జట్టులో అర్హత ఉన్నవారిని ఆడించడానికి… అందర్నీ ఆడించడానికి మధ్య తేడా ఉంటుంది అని షేన్ బాండ్ తెలిపాడు. అయితే ఈ ఐపీఎల్ లో చోటుతూ పాటుగా తర్వాత ప్రారంభమైన రంజీలో కూడా ముంబై జట్టులో అర్జున్ కు అవకాశం రాలేదు. అదే విధంగా కనీసం వచ్చే ఐపీఎల్ లోనైనా అర్జున్ ను ఆడిస్తారా లేదా అంటూ సచిన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

దీపక్ చాహర్ హనీమూన్ కు బోల్డ్ సలహా ఇచ్చిన అక్క మాలతీ చాహర్..!

2008 లోనే రిటైర్ అవుదాం అనుకున్న సెహ్వాగ్ ను అడ్డుకున్న సచిన్..!

Visitors Are Also Reading