Home » ఎన్టీఆర్ తార‌క‌ర‌త్న మ‌ధ్య గొడ‌వ‌లేంటి..? అస‌లేం జ‌రిగిందో తెలుసా..!

ఎన్టీఆర్ తార‌క‌ర‌త్న మ‌ధ్య గొడ‌వ‌లేంటి..? అస‌లేం జ‌రిగిందో తెలుసా..!

by AJAY
Published: Last Updated on
Ad

నందమూరి ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన‌ హీరోల‌లో తార‌క‌ర‌త్న కూడా ఒకరు. 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా తో తారకరత్న హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత తారకరత్న చాలా సినిమాలు చేశాడు. కానీ హీరోగా కమర్షియల్ హిట్ ను అందుకోలేకపోయాడు. ఇక అమరావతి సినిమాలో తారకరత్న విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈ సినిమాలో తార‌క‌ర‌త్న నటనకు నంది అవార్డు వచ్చింది.

Advertisement

ఇదిలా ఉంటే కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న తారకరత్న రీసెంట్ గా అనే 9 అవ‌ర్స్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తార‌క‌ర‌త్న‌ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా పలు చానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో తారకరత్న ఆసక్తికర విషయాలను వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ ను వెనక్కు నెట్ట‌డానికి మీరు ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చారని అంటారు.

Advertisement

అది నిజమేనా..? అంటూ యాంకర్ ప్రశ్నించగా తారకరత్న ఆసక్తికర సమాధానం చెప్పారు. ఎన్టీఆర్ 2000 -2001 మధ్య కాలంలో సినిమాల్లోకి వచ్చాడని అప్పటికే ఎన్టీఆర్ ఆది లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడని చెప్పాడు. ఆ తర్వాత 2002లో తాను సినిమాల్లోకి వచ్చినట్లు తెలిపారు. దాంతో ఎన్టీఆర్ ను వెన‌క్కి నెట్ట‌డానికే తాను సినిమాల్లోకి వచ్చానని ప్రచారం చేశారని చెప్పాడు. తమ్ముడు ఎన్టీఆర్ కు తాను ఎప్పుడూ కాంపిటీషన్ కాదని చెప్పారు. ఎన్టీఆర్ వేరే లెవల్ లో ఉన్నారని మంచి నటుడని అన్నారు.

ఏది ఏమైనప్పటికీ తాము నందమూరి ఫ్యామిలీ అని తారకరత్న చెప్పుకొచ్చారు. ఈరోజు తమ‌ ఇంటి పేరు నిలబడటానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ అని అన్నారు. తమ్ముడిగా ఎన్టీఆర్ ఎదగడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. తాను సినిమాల్లోకి రావాలనే ఇష్టంతో వచ్చానని.. అది తన కల అని తెలిపారు. చిన్నప్పటినుండి ఎన్టీఆర్ తో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు.

Also read:

పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్న మ‌న‌సంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్….వ‌రుడు ఎవ‌రంటే…! 

చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు.. సోనూసూద్ సాయం

Visitors Are Also Reading