manasantha nuvve child artist: ఉదయ్ కిరణ్ రీమాసేన్ జంటగా నటించిన మనసంతా నువ్వే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఉదయ్ కిరణ్ కెరీర్ లో రెండో సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో ఆ తరవాత వరుస అవకాశాలు వచ్చాయి. ఈ సినిమాలోకి కథ పరంగా ఉదయ్ కిరణ్ రీమేసేన్ చిన్నతనంలో ప్రేమించుకుంటారు. ఆ తరవాత విడిపోతారు. అయితే వీరిద్దరి చిన్ననాటి పాత్రల కోసం చైల్డ్ ఆర్టిస్ట్ లు నటించగా వారి నటనతో ఆకట్టుకున్నారు.
ముఖ్యంగా రీమాసేన్ కు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సుహానీ ప్రేక్షకుల మనసు దోచుకుంది. తూనీగా తూనీగా అనే పాటలో రుహాని ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో రుహాని హెయిర్ స్టైల్ చూసి అప్పట్లో చిన్నారులకు తమ పేరెంట్స్ అలాంటి హెయిర్ స్టైల్ నే చేయించేవారంటే ఎంత ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.
20 ఏళ్లు దాటిన తరవాత సుహానీ హీరోయిన్ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.2008 లో సవాల్ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించలేదు. ఆ తవరాత స్నేహగీతం సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బోల్తా కొట్టింది. ఆ తరవాత సుహానీ సినిమాలకు దూరం అయ్యింది.
Also Read: ఒక్క సినిమాకు సుకుమార్ ఎంత రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడో తెలుసా…?
ఇదిలా ఉంటే చైల్డ్ ఆర్టిస్ సుహానీకి తాజాగా నిశ్చితార్థం జరిగింది. ప్రస్తుతం సుహానీ వయసు 31 సంవత్సరాలు కాగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాతో నిశ్చితార్థం జరిగింది. విభర్ సంగీత కారుడు కూడా. ప్రస్తుతం రుహానీ విభర్ ల నిశ్చితార్థం ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దాంతో ఆమె ఫ్యాన్స్ కాబోయే జంటకి కంగ్రాట్స్ చెబుతున్నారు.
Also Read: రామ్ చరణ్ “మగధీర”ను ఫాలో అయ్యి అల్లు అర్జున్ ను చేసిన ఆ సినిమా అట్టర్ ఫ్లాప్…!