దేశవ్యాప్తంగా ప్రస్తుతం జ్ఞానవాపీ మసీదు వివాదం గురించి చర్చించుకుంటున్నారు. ఐదుగురు మహిళలు జ్ఞానవాపీ మసీదు పశ్చిమ గోడ వెనుక వైపు భాగంలో ఉన్న శృంగార్ గౌరీ, గణేశ, హనుమంతుడు పూజలకు అనుమతి ఇవ్వాలని కోరడంతో వారణాసి కోర్టు వీడియోగ్రఫీకి ఆదేశించింది. మే 14-16 తేదీలలో కోర్టు కమిషనర్ల ఆధ్వర్యంలో వీడియో చేసారు. ఆ వీడియో సర్వేను నిలిపేయాలంటూ అంజుమన్ ఇంతేజామియా మసీద్ కమిటీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు మాత్రం ఈ కేసును మళ్లీ వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేసింది.
Advertisement
ఇదిలా ఉండగానే.. వీడియోగ్రఫీకి సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోగ్రఫీ సర్వేలో వీడియో గ్రాఫర్‌గా ఉన్న గణేష్ శర్మ మాత్రం ప్రస్తుతం సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆయన సర్వేలో భాగంగా వాజూ ఖానాలోని కొలనులో శివలింగం బయటపెట్టినట్టు వెల్లడించాడు. ముస్లిం సంఘాలు ఆరోపించిన విధంగానే ఇది పౌంటెన్ అనే వ్యాఖ్యలను కొట్టి పారేసాడు. ఇక హిందూ న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ఇది కాశీ విశ్వనాథ్ కారిడార్ లో భాగమే అని నిర్థారించేందుకు కొన్ని ఆధారాలు వెలుగులోకి వచ్చాయని వెల్లడించారు.
Advertisement
ఇది ఇలా చర్చలు జరుగుతున్న తరుణంలోనే.. జ్ఞానవాపీ మసీదు వైపు చూస్తున్న నందికి ప్రస్తుతం శివలింగ ఆకారం బయటపడిన చోటుకు మధ్య కచ్చితంగా 83 అడుగుల దూరం ఉన్నది. శివలింగం అనడానికి ఇదే నిదర్శనమని.. ఇదే కాకుండా శివలింగం పవిత్రం చేయడానికి ఆలయంలో ఒక బావి ఉన్నదని.. దిగువన హిందూ దేవుళ్లు, దేవతల విగ్రహాలు ఉన్నాయని.. స్థంభాలపై త్రిశూలం గుర్తులు, సంస్కృత శ్లోకాలున్నాయని విష్ణు శంకర్ జైన్ వివరించారు. ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా చెబుతుంటే చివరికీ కోర్టు ఏమి చెబుతుందోనని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read :
“నన్ను బాగా వాడుకున్నావ్ కదరా” అంటూ ఆ డైరెక్టర్ పై శ్రీరెడ్డి ఫైర్..వీడియో వైరల్..!
అమ్మాయిల పెళ్లి విషయంలో తల్లిదండ్రులు అస్సలు చేయకూడని 5 తప్పులు ఇవే..!