Home » “న‌న్ను బాగా వాడుకున్నావ్ క‌ద‌రా” అంటూ ఆ డైరెక్ట‌ర్ పై శ్రీరెడ్డి ఫైర్..వీడియో వైర‌ల్..!

“న‌న్ను బాగా వాడుకున్నావ్ క‌ద‌రా” అంటూ ఆ డైరెక్ట‌ర్ పై శ్రీరెడ్డి ఫైర్..వీడియో వైర‌ల్..!

by AJAY
Ad

టాలీవుడ్ లో కొంత‌మంది న‌ట‌న‌తో టాలెంట్ తో గుర్తింపు తెచ్చుకుంటే మ‌రికొందరు మాత్రం వివాదాల‌తోనే గుర్తింపు తెచ్చుకుంటారు. అలా వ‌రుస వివాదాల‌తో ఎప్పుడూ వార్త‌ల్లో హాట్ టాపిక్ గా నిలిచే న‌టి శ్రీరెడ్డి. ఒక‌ప్పుడు శ్రీరెడ్డి అంటే ఎవ‌రికీ తెలియ‌దు. శ్రీరెడ్డి న‌టించిన ఓ సినిమాలోని వీడియో క్లిప్ వైర‌ల్ అయింది త‌ప్ప సినిమాల్లోనూ పెద్ద‌గా శ్రీరెడ్డి క‌నిపించింది లేదు.

Advertisement

కానీ కాస్టింగ్ కౌచ్ తో శ్రీరెడ్డి టాలీవుడ్ లో ర‌చ్చ చేసింది. పై దుస్తులు విప్పి మా ఛాంబ‌ర్ ముందు నిర‌స‌న‌కు దిగ‌డంతో నేష‌న‌ల్ మీడియాను సైతం ఆక‌ర్షించింది. అస‌లు ఎవ‌రు ఈ శ్రీరెడ్డి..? ఎందుకు ఇలా చేస్తుంద‌ని మొద‌ట అంతా అనుకున్నారు. అంతే కాకుండా ఆమె వ‌ద్ద ఎలాంటి ఆధారాలు లేవ‌ని కేవ‌లం ఆరోప‌ణ‌లు మాత్ర‌మే చేస్తుంద‌ని కూడా అనుకున్నారు. కానీ బ‌డా బాబుల చిట్టాను శ్రీరెడ్డి బ‌ట‌య‌పెట్ట‌డంతో ఒక్క‌సారిగా టాలీవుడ్ ప్ర‌కంప‌ణ‌లు వ‌చ్చాయి.

Advertisement

అందులో ద‌గ్గుబాటి ఫ్యామిలీకి చెందిన అభిరామ్ పేరు ఉండ‌టంతో అత‌డితో క‌లిసి క్లోజ్ గా ఉన్న ఫోటోల‌ను శ్రీరెడ్డి బ‌య‌ట‌పెట్ట‌డంతో అంతా షాక్ అయ్యారు. ఇక మ‌రికొంద‌రి ఫోటోల‌ను బ‌య‌ట‌పెట్ట‌లేదని కానీ ఆరోప‌ణ‌లు మాత్రం దారుణంగా చేసింది. ద‌ర్శ‌కులు, హీరోలు, సింగ‌ర్ లు ఇలా అంద‌రిపై శ్రీరెడ్డి సంచ‌ల‌న ఆరోణ‌లు చేసింది. ఇదిలా ఉండ‌గా శ్రీరెడ్డి గ‌తంలో ఆర్జీవీకి స‌పోర్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

కానీ ఆర్జీవీ ఏపీలో సినిమా టికెట్ ల ఇష్యూపై వైసీపీకి వ్య‌తిరేఖంగా మాట్లాడ‌టంతో శ్రీరెడ్డి ఆ ద‌ర్శ‌కుడిపై ఫైర్ అయ్యింది. త‌న యుద్దాన్ని చ‌ల్లార్చ‌డానికి ఆర్జీవీ సురేష్ బాబు ప‌క్క‌న చేరి స‌ఫ‌లం అయ్యాడ‌ని చెప్పింది. బాలీవుడ్ నుండి త‌రిమేస్తే మ‌ళ్లీ హైద‌రాబాద్ వ‌చ్చాడ‌ని ఆరోపించింది. ఆర్జీవీకి వార్త‌ల్లో ఉండాల‌ని పిచ్చి అని అందుకే త‌ర‌చూ వార్త‌ల్లో ఉండేలా అన్ని అంశాల‌పై స్పందిస్తాడ‌ని ఆరోపించింది.

Visitors Are Also Reading