ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని గతంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన విషయం విధితమే. అయితే ఇటీవలే సీఎం జగన్ దావోస్ టూర్‌కు వెళ్లిన విషయం తెలిసినదే. అయితే ఆ టూర్‌కు సంబంధించిన వివరాలను పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఇవాళ మీడియాకు వెల్లడించారు. అదానీ, అంబానీ, గ్రీన్‌కోలతో ఎంఓయూ చేసుకోవడం అంత దూరం వెళ్లాలా అని కొంత మంది ఎద్దేవా చేస్తున్నారు. వారికి ఏపీపై పూర్తి అవగాహన ఉండడంతోనే ఒప్పందం కుదుర్చున్నట్టు వివరించారు.
ఇక దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో పలు పారిశ్రామిక దిగ్గజాలకు ఏపీలో ఉన్న అవకాశాలపై సమర్థవంతంగా వివరించామని చెప్పారు. ముఖ్యంగా దావోస్ వేదికగా సీఎం జగన్ 50 మంది ప్రపంచ స్థాయి ప్రతినిధులతో సమావేశమయ్యారు. డీ కార్బనైజ్‌డ్ ఎకానమీ కోసం గ్రీన్ ఎనర్జీ ఉత్పాదకత పెంపుపై విస్తృత సమావేశం జరిగిందని తెలిపారు. విశాఖలో బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరాం. దానికి ఆ సంస్థ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఐటీ, పోర్ట్ రంగాల్లో విస్తృత అవకాశాలున్న విశాఖ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పుకొచ్చారు మంత్రి.
Advertisement
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల కోసం లక్ష ఎకరాలు సిద్ధంగా ఉన్నాయని.. దావోస్ వేదికగా తెలిపినట్టు వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఏపీలో లక్షన్నర కోట్ల పెట్టుబడులు రానున్నాయని.. దీని ద్వారా దాదాపు 38వేల ఉద్యోగాలు కూడా అందుబాటులోకి రానున్నట్టు ప్రకటించారు. డీ కార్బనైజ్‌డ్ ఎకానమీకి ఏపీని ఫైలట్‌గా చేయాలని నిర్ణయించుకున్నామని మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా కొందరూ కావాలనే విశాఖపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దావోస్‌లో సమావేశమైన అన్ని కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పేట్టే వరకు వెంటపడుతామని మంత్రి వెల్లడించారు. కొంత మంది ప్రతినిధులు విశాఖ మునిగిపోతుందని.. అడిగారని, కావాలనే కొందరూ దుష్ప్రచారం చేసారని పేర్కొన్నారు. దయచేసి ఓ ప్రాంతం యొక్క ఇమేజ్‌ను అసలు దెబ్బతీయకూడదని విజ్ఞప్తి చేశారు మంత్రి అమర్‌నాథ్.
Also Read :
మహానాడు గురించి జనసేన అధినేత ఆరా.. అందుకోసమేనా..?
అక్క పెళ్లిలో చెల్లి డాన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!