Ad
ఐపీఎల్ 2020లో దారుణంగా విఫలమైన ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ ను భారీ ధరకు 2021 వేలంతో తీసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు. అయితే ఆ సీజన్ లో అందుకు తగ్గినట్లుగానే మంచి ప్రదర్శన చేసాడు. దాంతో ఈ ఐపీఎల్ 2022 సీజన్ కంటే ముందు జరిగిన మెగవేలంకు మ్యాక్స్‌వెల్ ను వదలకుండా 11 కోట్ల భారీ ధరకు అతడిని రిటైన్ చేసుకుంది బెంగళూర్ జట్టు. కానీ ఈ ఐపీఎల్ సీజన్ లో అతడి దారుణంగా విఫలమయ్యాడు.
దాంతో మ్యాక్స్‌వెల్ ను తీసుకోవడమే బెంగళూర్ చేసిన చెత్త పని అంటున్నాడు ఆ జట్టు మాజీ ఆటగాడు పార్థీవ్ పటేల్. అస్సలు మ్యాక్స్‌వెల్ యొక్క ఐపీఎల్ కెరియర్ ను చుకున్నట్లైతే అతను ఎప్పుడు కన్సిస్టెన్సీగా పరుగులు చేయలేదు. ప్రతి 5 సీజన్లలో ఒక్కసారి రాణిస్తాడు అంతే. ఆ తర్వాత ఆ సీజన్ ఆటతో మిగిలిన నాలుగు సీజన్లు ఏం ఆడకుండానే కోట్లు తన ఖాతాలో వేసుకుంటాడు. కాబట్టి గత సీజన్ లో కొంచెం మెరుగ్గా ఆడిన మ్యాక్స్‌వెల్ ఈ సీజన్ లో ఆడుతాడు అని అతడిని రిటైన్ చేసుకోవడం ఆ జట్టు చేసిన పెద్ద తప్పు.
మ్యాక్స్‌వెల్ గత సీజన్ లో బాగా ఆడాడు అంటే దాని అర్ధం మరోనాలుగు సీజన్ల వరకు అతను మళ్ళీ పరుగులు చేయడు. కానీ అది తెలుసుకోకుండా మ్యాక్స్‌వెల్ ను తీసుకోవడంతూ నేను షాక్ అయ్యాను పార్థీవ్ పటేల్ అన్నాడు. అలాగే బెంగళూర్ జట్టు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వల్లే ఆ జట్టు పరాజయాలు చవి చూసింది పార్థీవ్ పటేల్ అన్నారు. అయితే ఈ వేలం ముందు బెంగళూర్.. కోహ్లీ, మ్యాక్స్‌వెల్, సిరాజ్ ను రిటైన్ చేసుకుంది. కానీ ఈ ఐపీఎల్ లో ఈ ముగ్గురే రాణించలేదు.
ఇవి కూడా చదవండి :
ఐపీఎల్ లో కొత్త రికార్డు నెలకొల్పిన గుజరాత్ బౌలర్..!
సచిన్ ను మెప్పించిన తిలక్ వర్మ..!
Advertisement