బుల్లితెర మీద క్రేజీయెస్ట్, రొమాంటిక్ యాంకర్ జోడి ఏది అంటే సుడిగాలి సుదీర్- రష్మి గౌతమ్ అని చెబుతారు. వీరిద్దరు జోడీగా ఏ షో చేసినా అక్కడ చూసేవాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కచ్చితంగా ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి ఆ షో లో చేసే రొమాన్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే మొన్నటి వరకు ఢీ, ఎక్స్ స్ట్రా జబర్దస్త్ షో లలో వీళ్లిద్దరు కలిసి చేసే సందడి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. కానీ అనుకోకుండా ఇద్దరూ ఢీ షోను వదిలి వెళ్లిపోయారు. ఎక్స్ స్ట్రా జబర్దస్త్ నుండి కూడా సుధీర్ బయటకు వచ్చేసాడు. ఆయన ప్లేస్ లో రాంప్రసాద్ స్కిట్స్ చేస్తున్నాడు. ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుధీర్ లేకపోవడంతో సుధీర్ ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతున్నారు. సుధీర్ రష్మీ ల ను జంటగా చూసేందుకు అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు.
Advertisement
Advertisement
చాలా సందర్భాలలో సుధీర్ రష్మీ మీద ఉన్న ప్రేమను బయట పెట్టాడు. అప్పుడప్పుడు రష్మీ కూడా సుధీర్ కి ఓకే చెప్పినట్లుగా యాక్ట్ చేసేది. అయితే వీళ్లిద్దరు చేసేది స్కిట్ వరకు మాత్రమే అని అందరికీ తెలుసు. కానీ వాళ్లు చేసే కామెడీతో అందరూ నవ్వుకుంటారు. అయితే ఈ నేపథ్యంలో ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో రాంప్రసాద్ స్కిట్ లో రష్మీ చెల్లి పాత్రను పోషిస్తుంది. ఆ స్కిట్ లో రష్మీ మాట్లాడుతూ.. నాకు పెళ్లి ఇష్టం లేదు నా మనసులో వేరే వాడు ఉన్నాడు అని చెబుతుంది.
అయితే ఈ మాటలు సుధీర్ ని ఉద్దేశించే మాట్లాడుతుందని పలువురు అంటున్నారు. ఇంతకీ రష్మీ ఏమన్నదంటే.. నేను ఒక వ్యక్తిని ప్రేమించాను. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మనం మనస్ఫూర్తిగా ఎవరినైనా ప్రేమిస్తే గుండె చప్పుడు ఆగే వరకు ఆ గుండెలో ఆ వ్యక్తే ఉంటాడు. ఇష్టమైన వాళ్ళు పక్కన లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు అంటూ రష్మీ చాలా ఎమోషనల్ అయింది. అయితే రష్మీ మాట్లాడిన మాటలన్నీ సుధీర్ కే వర్తిస్తాయి అని సుధీర్ మీద ఉన్న ప్రేమను తెలియజేస్తున్నాయి అంటూ నెటిజన్లు భావిస్తున్నారు.