Ad
ఎక్కువగా పర్యటన పై ఆధారపడే శ్రీలంకను కరోనా భారీ దెబ్బ కొట్టింది. ఆ తర్వాత వారు అవగాహనా లేకుండా విదేశాల దగ్గర ముఖ్యంగా చైనా దగ్గర తీసుకున్న అప్పులు కూడా ఇప్పుడు ఆదేశంలో నెలకొన్న పరిస్థితులకు కారణం. అయితే ఇప్పుడు లంక పరిస్థితి ఏంటి అనే విషయం అందరికి తెలిసిందే. తినడానికి తిండి లేకుండా దేశం మొత్తం రోడ్డుపై పడింది. అక్కడ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు. ఈ ఆర్ధిక సంక్షోభం నుండి ఎలా బయటపడాలి అనేది వారికీ తెలియడం లేదు. దీని ప్రభావం శ్రీలంక క్రికెట్ పైన కూడా పడింది.
ప్రస్తుతం బంగ్లాదేశ్ వేదికగా టెస్ట్ సిరీస్ ఆడుతున్న లంక టీంతో వచ్చే నెలలో ఆస్ట్రేలియా జట్టు మూడు ఫార్మాట్లలో సిరీస్ ఆడాలి. అయితే ఈ లంక పర్యటన పై ఆసీస్ ఆటగాళ్లు ఆసక్తిగా లేరు అని తెలుస్తుంది. లంక ప్రజలకు తినడానికి తిండి లేకుంటే మేము వారి మధ్యలో క్రికెట్ ఎలా ఆడుతాం అని ఆసీస్ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు అని తెలుస్తుంది. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఆటగాళ్ల నిర్ణయం పట్ల ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది.
తాజాగా ఆస్ట్రేలియా బోర్డు సీఈవో టాడ్ గ్రీన్బెర్గ్ ఇదే విషయం పై స్పందిస్తూ.. ఇప్పుడు శ్రీలంకలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మా ఆటగాళ్లు తెలుసు. అక్కడ ప్రజలు ఇప్పటికే అన్ని రకాల కష్టాలు పడుతుంటే మేము అక్కడ ఎలా క్రికెట్ ఆడుతాం అని వారు అనుకుంటున్నారు. అయితే మాకు మా ఆటగాళ్ల భద్రతతో పాటుగా మిగితా అని కోణాల్లో ఆలోచించి ఈ పర్యటనకు వెళ్లాలా వద్ద అనే విషయం పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం అని ఆయన తెలిపారు. అయితే తమ వద్ద పెట్రోల్ లేకపోవడంతో లంక బోర్డు మొదట టెస్ట్ మ్యాచ్ లు ఆడించాలి.. తర్వాత వన్డే, టీ20 సెరిసులు నిర్వహిస్తాం అని ఇప్పటికే ఆసీస్ బోర్డుకు తెలియజేసింది.
ఇవి కూడా చదవండి :
Advertisement