Home » తాతయ్య, అక్కయ్య, అన్నయ్య.. ఇలా ప్రతి పిలుపు వెనుక అయ్యా అని ఎందుకు ఉంటుందో తెలుసా..?

తాతయ్య, అక్కయ్య, అన్నయ్య.. ఇలా ప్రతి పిలుపు వెనుక అయ్యా అని ఎందుకు ఉంటుందో తెలుసా..?

by Azhar
Ad

ప్రస్తుతం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలే అయిన ఇక్కడ ఎక్కువ మంది హిందీ, ఇంగ్లీషులో మాట్లాడుతారు. ఒక్కపుడు అందరూ తెలుగులోనే మాట్లాడిన.. ప్రస్తుతం ఉన్న ఈ టెక్నాలజీ యుగంలో పిల్లలు అందరూ ఇంగ్లీషు మీడియంలో చదువుతూ.. ఆ పర భాషకే ఎక్కువ అలవాటు పడ్డారు. అందుకు తగినట్లుగానే ఇప్పుడు పిల్లలు మమ్మీ, డాడీ, అంకుల్, అంటి అని పిలుస్తున్నారు. వారికీ మన పిలుపు అనేదే సరిగ్గా తెలియదు. ఇక దాని వెనుక ఉన్న అర్ధం ఏం తెలుస్తుంది.

Advertisement

అయితే మన తెలుగులో తాతయ్య, మామయ్య. అత్తయ్య, అక్కయ్య, అన్నయ్య అని పిలుస్తుంటారు. ఇలా అన్ని పిలుపుల వెనుక అయ్యా అనే పదం ఎందుకు ఉందొ మీకు తెలుసా..?. మన తెలుగులో ఈ అయ్యా అనే పదం ఆర్య అనే పదం నుండి వచ్చింది. దీనిని మనం మనకంటే పెద్ద వారిని పిలవడానికి, వారికీ గౌరవం ఇవ్వడానికి ఉపయోగిస్తుంటాము. అందుకే కాలానుగునేనా ఇది మన పిలుపులోకి మారిపోయింది. తాతయ్య, మామయ్య. అత్తయ్య, అక్కయ్య, అన్నయ్య ఇలా.. ఎందుకంటే వీరందరూ మనకంటే వయస్సులో పెద్దవారే కాబట్టి.

Advertisement

అదే విధంగా కొన్ని చోట్ల ఇంకా గౌరవం ఇస్తూ ‘గారు’ అని పిలుస్తారు. తాతయ్యగారు, మామయ్యగారు, అత్తయ్యగారు, అక్కయ్యగారు, అన్నయ్యగారు ఇలా అన్నమాట. మనం ఈ గారు అనే పదాని కూడా పెద్దలకు, పండితులకు, గురువులకు గౌరవం ఇస్తూ పిలుస్తాం. ఇనాక్ కొన్ని చోట్లనైతే ఆండీ అని కూడా అంటుంటారు. అంటే తాతయ్యగారండీ, మామయ్యగారండీ, అత్తయ్యగారండీ, అక్కయ్యగారండీ, అన్నయ్యగారండీ. ఇవ్వని పెద్దవాళ్లను గౌరవిస్తూ మన చిన్నపుడు పిలిచినా పిలుపులే. కానీ ఇప్పుడు ఇవ్వని కనుమరుగవుతున్నాయి. ఇంకా కొన్ని రోజులైతే ఇవి కనిపిస్తాయో లేవో కూడా తెలియని పరిస్థితి.

ఇవి కూడా చదవండి :

ఆర్ఆర్ ఫ్లైట్ లో పొగమంచు.. ల్యాండ్ చేయాలంటూ ఆటగాళ్ల కేకలు..!

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు వానగండం గుజరాత్ కు కలిసి వస్తుందా..?

Visitors Are Also Reading