చాలామంది గోరింటాకును చేతులకు పెట్టుకుంటూ ఉంటారు. కానీ గోరింటాకు నుదుటి మీద పెట్టుకుంటే పండదు ఎందుకో తెలుసా? గోరింటాకు అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం. ఆ పేరు వినగానే పెట్టుకోవాలి అనే అనుభూతి కలుగుతుంది. ఆషాడం లో చాలామంది గోరింటాకును పెట్టుకుంటారు. ముఖ్యంగా కొత్త పెళ్లి కూతుర్లు ఆషాడమాసంలో అత్తింటి వారి నుంచి పుట్టింటికి వెళ్తారు. పెళ్లికాని వారికైతే చేతులకు పెట్టుకున్న గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగుడు వస్తాడని అర్థం. అయితే ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకోవాలని ఎందుకు అంటారు..?అసలు గోరింటాకు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..?
గోరింటాకు అంటే పార్వతి అమ్మవారికి చాలా ఇష్టమట. గోరింటాకు అసలు పేరు గౌరింటాకు. గౌరీదేవి బాల్యంలో స్నేహితులతో ఆడుకుంటున్న సమయంలో రజస్వల అవుతుంది. అయితే ఆ రక్తపు చుక్క నేలకు తాకగానే ఒక మొక్క పుడుతుంది. ఈ వింత గురించి చెలికత్తెలు చెప్పగా వెంటనే పర్వతరాజు చూసేందుకు వస్తాడు. ఆ కొద్ది సమయంలోనే ఆ చెట్టు పెద్దదై తాను సాక్షాత్తు పార్వతీ దేవి రుదిర అంశతో జన్మించానని నా వల్ల లోకానికి ఉపయోగం కలుగుతుందని చెబుతుంది. అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు ఆకులను కొస్తే ఆమె చేతు ఎర్రబడిపోతుంది.
Advertisement
Advertisement
రజస్వల సమయంలో ఈ చెట్టు ఉద్భవించింది కాబట్టి స్త్రీల గర్భాశయ దోషాలను, అతి వేడి తొలగించి, స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుందని ఎర్రగా చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకరణగా తోడ్పడుతుందని ఆశీర్వదిస్తారు పర్వతరాజు. అప్పటి నుండి స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరింటాకును చెబుతారు. అయితే అరచేతిలో పండే గోరింటాకు నుదిటిన మాత్రం పండదు.
ఎందుకంటే గోరింటాకు ఉద్భవం గురించి తెలిసిన కుంకుమ గౌరీ దేవి దగ్గరికి వచ్చి ఇక అందరూ నుదిటిన కూడా ఈ ఆకుతోనే బొట్టును దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గి పోతుంది కదా అని చెప్పి బాధ పడుతుందట. అప్పుడు గౌరీదేవి ఈ ఆకు నుదుటిన పండదని చెబుతుంది. ఇలా గోరింటాకు పండటం అనేది స్త్రీల ఆరోగ్యాన్ని కూడా సూచిస్తుంది. అంతేకాదు శాస్త్రపరంగా చూస్తే ఆషాడమాసం వర్షాకాలం తరచూ తడుస్తూ ఉండడంవల్ల కాళ్ళ పగుళ్ళు,ఫంగస్ లాంటి వ్యాధులు వస్తాయి. వీటి బారి నుంచి తప్పించుకోవడానికి కూడా గోరింటాకు పెట్టుకుంటారు.
also read;
పచ్చని కాపురంలో మామిడికాయ చిచ్చు.. మహిళ ప్రాణం బలి.. కారణం తెలిస్తే తిట్టుకుంటారు..?
ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కలకలం..డబ్ల్యూహెచ్ఓ ఏమంటుందంటే..?