Telugu News » ప్ర‌పంచ వ్యాప్తంగా మంకీపాక్స్ క‌ల‌క‌లం..డ‌బ్ల్యూహెచ్ఓ ఏమంటుందంటే..?

ప్ర‌పంచ వ్యాప్తంగా మంకీపాక్స్ క‌ల‌క‌లం..డ‌బ్ల్యూహెచ్ఓ ఏమంటుందంటే..?

by Anji

ఓవైపు క‌రోనా మ‌హ‌మ్మారితో స‌త‌మ‌త‌మ‌వుతున్న త‌రుణంలోనే ప్ర‌పంచ జ‌నాల‌ను మ‌రొక వైర‌స్ భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తుంది. ప్ర‌పంచ దేశాల‌ను మంకీ పాక్స్ వైర‌స్ క‌ల‌వ‌ర‌పెడుతోంది. బ్రిట‌న్‌లో వెలుగు చూసిన ఈ వైర‌స్ నెమ్మ‌దిగా ఇత‌ర దేశాల‌కు కూడా విస్త‌రించ‌డం మొద‌లుపెడుతుంది. ఇప్ప‌టికే 150 వ‌ర‌కు కేసులు న‌మోదు అయ్యాయి. మ‌రిన్నీ కేసులు ప‌రిశీల‌న‌లోనే ఉన్నాయి. దీంతో కేసుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశ‌ముంది.

Ads

బ్రిట‌న్‌లో మే 07న ఓ వ్య‌క్తిలో మంకీపాక్స్ వైర‌స్‌ను క‌నుకున్నారు. నైజీరియా నుండి బ్రిట‌న్‌కు వ‌చ్చిన వ్యక్తిలో వైర‌స్‌లో వెలుగులోకి వ‌చ్చింది. ఇక అప్ప‌టి నుండి బ్రిట‌న్‌లో కేసుల సంఖ్య‌లో పెరుగుతూనే ఉన్న‌ది. ఇప్పుడు ఏకంగా 20కి చేరుకున్న‌ది. స్పెయిన్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 23 కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. బ్రిట‌న్‌, స్పెయిన్‌, పోర్చుగ‌ల్‌, ఇట‌లీ, స్వీడ‌న్‌, కెన‌డా, అమెరికాలో మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. ఇక తాజాగా బెల్జియం, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా కూడా ఈ జాబితాలో చేరాయి.


మంకీపాక్స్ వైర‌స్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అత్య‌వ‌స‌ర స‌మావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ స‌మావేశంలో మంకీపాక్స్ వ్యాధి విస్త‌ర‌ణ‌, నివార‌ణ‌పై చ‌ర్చించింది. ఇక ప‌రిస్థితులు ప్ర‌మాద‌క‌రంగా ఉన్నాయ‌ని.. మంకీపాక్స్ కేసులు మ‌రిన్ని వెలుగుచూసే అవ‌కాశ‌ముంద‌ని డ‌బ్ల్యూహెచ్ఓ అంచ‌నా వేస్తుంది. ఎపిడెమియోలాజిక‌ల్ ప‌రిశోధ‌న‌లు కొన‌సాగుతున్నాయ‌ని, స్వ‌లింగ సంప‌ర్కుల‌కే ఎక్కువ‌గా ఈ వైర‌స్ సోకుతుంద‌ని వెల్ల‌డించింది. ప్ర‌పంచ దేశాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని డ‌బ్ల్యూహెచ్ఓ హెచ్చ‌రించింది. భార‌త ప్ర‌భుత్వం కూడా అప్ర‌మ‌త్తం అయింది.

మంకీ పాక్స్ ఎలా సోకుతుంది..?

మంకీపాక్స్ ఓ వైర‌ల్ వ్యాధి. జంతువుల నుంచి మ‌నుషుల‌కు సోకుతుంది. తుంప‌ర్ల ద్వారా లేదా వ్యాధి సోకిన వ్య‌క్తికి అతి ద‌గ్గ‌ర ఉండ‌డం వ‌ల్ల ఇది ఇత‌రుల‌కు వ్యాపించే అవ‌కాశ‌ముంది. వ్యాధి సోకిన జంతువు క‌రిచినా ఇది సోకుతుంది. వ్యాధి సోకిన జంతువుల మాంసాన్ని స‌రిగ్గా ఉడికించ‌కుండా తిన్నా ఈ వ్యాధి సంభ‌వించే అవ‌కాశ‌ముంది. శ‌రీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెంద‌డానికి సాధార‌ణంగా 6 నుంచి 13 రోజులు ప‌డుతుంది. ఒక్కోసార 5 నుండి 21 రోజుల స‌మ‌యం కూడా ప‌డుతుంద‌ని స‌మాచారం. మంకీపాక్స్ వైర‌స్‌ను 1958లో తొలిసారిగా కోతుల్లో గుర్తించారు. అందుకే మంకీపాక్స్ అని పేరు పెట్టారు. 1970లో తొలిసారి మ‌నుషుల్లో ఇది బ‌య‌ట‌ప‌డింది.

మంకీపాక్స్ ల‌క్ష‌ణాలు

జ్వ‌రం, త‌ల‌నొప్పి, వాపు, న‌డుంనొప్పి, కండ‌రాల నొప్పి, అల‌స‌ట వంటివి మంకీపాక్స్ ల‌క్ష‌ణాలు. ముఖ్యంగా చికెన్ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్ల‌పై బొబ్బ‌లు ఏర్ప‌డుతాయి. ఒక్కోసారి ఈ బొబ్బలు శ‌రీరం అంతా వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ ల‌క్ష‌ణాలు 14-21 రోజుల్లో బ‌య‌ట‌ప‌డ‌తాయి. మైల్డ్ కేసుల్లో ల‌క్ష‌ణాలు క‌నిపించ‌క‌పోవచ్చు. ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది 5-7 రోజుల్లో కోలుకుంటారు. 10 మందిలో ఒక‌రికీ ఇది ప్రాణాంత‌కంగా మారుతుంద‌ని వివేదిక‌లు చెబుతున్నాయి. మ‌శూచి టీకాలే మంకీపాక్స్ నుండి రక్ష‌ణ క‌ల్పిస్తాయి.

Also Read : 

చ‌నిపోయిన త‌ర‌వాత కాళి బొట‌న‌వేళ్ల‌ను ఎందుకు క‌డ‌తారో తెలుసా….?

నూత‌న ఫీచ‌ర్‌తో యూట్యూబ్‌.. మీకు న‌చ్చిన సీన్ వీడియోలో ఎక్క‌డుందో ఇలా చూడ‌వ‌చ్చు..!

 


You may also like