Home » దూకుడు సినిమాతో పాటూ యాంక‌ర్ సుమ ఇల్లు ఎన్ని సినిమాల్లో క‌నిపిస్తుందో తెలుసా…!

దూకుడు సినిమాతో పాటూ యాంక‌ర్ సుమ ఇల్లు ఎన్ని సినిమాల్లో క‌నిపిస్తుందో తెలుసా…!

by AJAY
Ad

యాంక‌ర్ సుమ టాలీవుడ్ లో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. న‌టిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన సుమ హీరోయిన్ గా స‌క్సెస్ అవ్వ‌లేక‌పోయింది. కానీ యాంక‌ర్ గా ఎంట్రీ ఇచ్చి మాత్రం తిరుగులేని గుర్తింపును సంపాదించుకుంది. క్యాష్, స్టార్ మ‌హిళ లాంటి టీవీ షోల‌తో యాంక‌ర్ సుమ బుల్లి తెర‌పై తిరుగులేని రికార్డులు క్రియేట్ చేసింది. రీసెంట్ గా యాంక‌ర్ సుమ జ‌య‌మ్మ పంచాయితీ సినిమాతో న‌టిగా రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అనుకున్న‌మేర విజ‌యం సాధించ‌లేదు.

Advertisement

కానీ సుమ న‌ట‌నతో మాత్రం ఆక‌ట్టుకుంద‌ని ప్రేక్ష‌కులు భావిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా యాంక‌ర్ సుమకు మాత్ర‌మే కాకుండా ఆమె ఇంటికి కూడా ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో యాంక‌ర్ సుమ ఇల్లు క‌నిపిస్తుంది. అలా టాలీవుడ్ లో ఏ ఏ సినిమాల్లో యాంక‌ర్ సుమ ఇల్లు క‌నిపిస్తుందో ఇప్పుడు చూద్దాం….నాగచైత‌న్య హీరోగా సుకుమార్ ద‌ర్శక‌త్వంలో వ‌చ్చిన 100% ల‌వ్ సినిమా సూప‌ర్ హిట్ గా నిలిచింది.

Advertisement

ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం ఇంట్లోనే జ‌రుగుతుంది. ఆ ఇల్లు యాంక‌ర్ సుమ వాళ్ల‌దే. ఎన్టీఆర్ శ్రీను వైట్ల కాంబినేష‌న్ లో వ‌చ్చిన బాద్ షా సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇల్లు కూడా యాంక‌ర్ సుమ సొంత ఇల్లే. అంతే కాకుండా దూకుడు సినిమాలో మ‌హేశ్ బాబు ప్ర‌కాష్ ఓ ఇంట్లో ఉంటారు. ఆ ఇల్లు సినిమాలో చాలా ఫోక‌స్ అయ్యింది.

ఇంటి ముందు చాలా సీన్లు ఉంటాయి. ఆ అంద‌మైన ఇల్లు కూడా యాంకర్ సుమ వాళ్లదే. పూలరంగ‌డు సినిమాలో సునీల్ ఇల్లు మరియు బ్రూష్ లీ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ క‌నిపించే ఇల్లు కూడా యాంకర్ సుమ వాళ్ల‌దే కావ‌డం విషేషం. ఇలా చాలా సినిమాల్లో యాంకర్ సుమ ఇంటిని వాడుకున్నారు. ఇల్లు షూటింగ్ ల‌కు అనువుగా ఉండ‌టం…అందంగా ఉండ‌ట‌మే అన్ని సినిమాల్లో వాడుకోవ‌డానికి కార‌ణం.

ALSO READ :

“హ్యాపీ డేస్” అప్పు ఇప్పుడు ఎలా ఉందో చూశారా…? సినిమాలను వదిలేసి ఇప్పుడు ఏం చేస్తుందంటే…!

Visitors Are Also Reading