ప్రస్తుతం చిన్న వయసులోనే చాలా మంది ముఖంలో వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తుంటాయి. ముఖం ముడతలు, చారలు, చర్మం గిపోవడం, స్కిన్ పిగ్మెంటేషన్ వంటివన్ని వృద్దాప్య లక్షణాల కిందికే వస్తాయి. వాతావరణ మార్పులు, ఆహారపు అలవాట్లు, నిద్రను నిర్లక్ష్యం చేయడం, మద్యపానం, ధూమపానం, శరీరానికి శ్రమ లేకపోవడం వంటి రకరకాల కారణాల వల్ల ముఖంలో ముసలితనం త్వరగా వచ్చేస్తుంటుంది. ఈ లిస్ట్‌లో మీరు ఉండకూడదని అనుకుంటున్నారా..? అయితే వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయాలని భావిస్తున్నారా..? వెంటనే ఇప్పుడు చెప్పబోయే ఫుడ్స్ మీ డైట్లో భాగంగా చేర్చుకోండి.
బొప్పాయి :
Advertisement
వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడానికి బొప్పాయి పండు అద్భుతంగా సహాయపడుతుంది. బొప్పాయిని ఆహారంలో భాగం చేసుకుంటే అందులో ఉండే విటమిన్-ఏ, విటమిన్-ఈ, విటమిన్ కే, కెరోటినాయిడ్స్ వంటి పోషకాలు ఏజింగ్ ప్రాసెస్ ను ఆలస్యం చేస్తాయి. చర్మాన్ని యవ్వనంగా నిగారింపుగా మారుస్తాయి.
పాలకూర :
ఆరోగ్యానికే కాదు. చర్మానికి చాలా మేలు చేస్తుంది. వారంలో కనీసం మూడు సార్లు అయినా పాలకూరను తీసుకుంటే స్కిన్ పిగ్మెంటేషన్, ముడతలు, చారలు వంటివి చర్మంపై పడకుండా ఉంటాయి. ఒకవేళ అవి ఉన్నా క్రమంగా తగ్గిపోయి ముఖం గ్లోయింగ్‌గా మారుతుంది.
Advertisement
అవకాడో పండు :
అవకాడో పండు ధర కాస్త ఎక్కువనే చెప్పాలి. అయినప్పటికీ వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయాలనుకునేవారు కచ్చితంగా అవకాడో పండును తీసుకోవాలి. రోజుకు ఒక అవకాడో పండును తింటే చర్మం యవ్వనంగా మెరవడంతో పాటు ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు శరీరానికి లభిస్తాయి.గుండె జబ్బులు దరి చేరకుండా ఉంటాయి. క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. మధుమేహం, అధిక రక్తపోటు వంటివి అదుపులో ఉంటాయి.
చేపలు :
చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో సూపర్‌గా హెల్ప్ చేస్తాయి. చేపల్లో పుష్కలంగా ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ వంటి పోషకాలు వయసు పెరిగినా వృద్ధాప్యాన్ని రాకుండా అడ్డుకుంటాయి. అందుకే వారంలో చేపలను ఒక్కసారైనా తీసుకోవాలని చెబుతుంటారు. ఇక ఈ ఆహారాలతో పాటు కంటి నిండా నిద్రపోవాలి. మద్యపానం, ధూమపానం అలవాట్లను మానుకోవాలి. రెగ్యులర్‌గా వ్యాయామాలు చేయాలి. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. చర్మంలో తేమ తగ్గకుండా చూసుకోవాలి. దీంతో వయస్సు ఎంత పెరిగినా కానీ మీరు యవ్వనంగానే కనిపిస్తారు.
Also Read :
Samantha: మరొక పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సమంత గ్రీన్ సిగ్నల్..!
Chanakya Niti : మీ జీవితంలో ఇలాంటి స్త్రీలు ఉంటే అస్సలు వదులుకోవద్దు..!