Home » శ్రీదేవిని క‌మ‌ల్ ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

శ్రీదేవిని క‌మ‌ల్ ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

by AJAY
Published: Last Updated on

కొన్ని జంట‌లు వెండితెర‌ను ఏలాయి. ఆ జంట‌ల సినిమాలంటే ఓ పండ‌గ వాతావ‌ర‌ణం క‌నింపించేది. అలా వెండితెర‌ను ఏలిన న‌టీన‌టుల్లో విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ అతిలోక సుంద‌రి శ్రీదేవి జంట కూడా ఒక‌టి. ఇక ఈ ఇద్ద‌రి కాంబోలో వ‌చ్చిన ప‌లు చిత్రాలు సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచాయి. ఆక‌లి రాజ్యం, వసంత కోకిల‌, ఒక‌రాధ ఇద్దరు కృష్ణులు సినిమాల్లో ఈ పెయిర్ ను చూసి ఎంతో మంది ముచ్చ‌ట‌ప‌డ్డారు. అంతే కాకుండా ఈసినిమాల్లో వీరి రొమాన్స్ కు వంద‌మార్కులు ప‌డ్డాయి.

Also Read: రిలీజ్ కు 6 సీక్వెల్స్ రెడీ ! వ‌రుస‌గా వ‌స్తున్న పార్ట్ 2 లు!!

kamal hasan sridevi

kamal hasan sridevi

ఇక త‌మిళంలో అయితే ఈ జంట‌కు స‌ప‌రేట్ ఫ్యాన్ బేస్ ఏర్ప‌డింది. అదేవిధంగా హిందీలోనూ క‌లిసి న‌టించి ప్రేక్ష‌కును అల‌రించారు. ఇక వీరి జంట‌ను చూసి అభిమానించిన‌వారు నిజ జీవితంలోనూ వీరు ఒక్క‌టైతే భాగుండ‌ని భావించేవారు. అంతే కాకుండా శ్రీదేవి కుటుంబంతో క‌మ‌ల్ హాసన్ ఎంతో స‌న్నిహితంగా ఉండేవార‌ట‌. త‌మ కుటుంబంతో స‌న్నిహితంగా ఉండ‌టం….జంట కూడా చూడ‌టానికి ముచ్చ‌ట‌గా క‌నిపించ‌డంతో స్వ‌యంగా శ్రీదేవి త‌ల్లి శ్రీదేవిని పెళ్లి చేసుకోవాల‌ని క‌మ‌ల్ హాస‌న్ ను కోరింద‌ట‌. కానీ తాను శ్రీదేవిని తోబుట్టువులా భావించేవాడిని అని అందుకే ఆమెను పెళ్లి చేసుకోలేన‌ని చెప్పార‌ట‌.

kamal hasan sridevi

kamal hasan sridevi

ఈ విష‌యాన్ని క‌మ‌ల్ హాస‌న్ స్వ‌యంగా వెల్ల‌డించారు. శ్రీదేవికి నివాళ్లు అర్పించే ఓ కార్య‌క్ర‌మం సంధ‌ర్బంగా శ్రీదేవి 28 అవ‌త‌రాలు అని రాసిన ఓ నోట్ లో క‌మ‌ల్ ఈ విష‌యాన్ని ప్ర‌స్థావించారు. అంతే కాకుండా తానంటే శ్రీదేవికి ఎంతో గౌర‌వ‌మని క‌మ‌ల్ హాస‌న్ పేర్కొన్నారు. త‌ను చ‌నిపోయేదాకా త‌న‌ను శ్రీదేవి సార్ అని పిలిచేద‌ని క‌మ‌ల్ హాస‌న్ వెల్ల‌డించారు. ఇక ఇప్ప‌టికీ వీరి కాంబోలో తెర‌కెక్కిన ప‌లు చిత్రాలు వ‌చ్చాయంటే టీవీల‌కు అతుక్కుపోతుంటారు. అలాంటి క్రేజ్ ఈ పెయిర్ కు ఉంది మరి.

Also Read: అమ్మాయిది ఫ్రాన్స్, అబ్బాయిది ఇండియా…వీళ్ల ల‌వ్ స్టోరీలో బోలెడ‌న్ని ట్విస్టులు!!

Visitors Are Also Reading