Home » రాత్రి వేళలో పెరుగు ఎందుకు తినకూడదో మీకు తెలుసా..?

రాత్రి వేళలో పెరుగు ఎందుకు తినకూడదో మీకు తెలుసా..?

by Anji
Ad

భారతదేశ సంప్రదాయం ప్రకారం రకరకాల ఆహార పదార్థాలు వండి తింటుంటారు. అందులో పెరుగు ఒకటి. ముఖ్యంగా మనం భోజనం చేసినప్పుడు సంతృప్తిగా ముగించాలి అనుకుంటే పెరుగు తప్పనిసరి. పెరుగు ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. పెరుగులో కాల్షియం, విటమిన్ b2, విటమిన్ b3, విటమిన్ b12, విటమిన్ b6, జింకు, ప్రోటీన్, మెగ్నీషియం ప్రోబోయోటిక్స్ ఇలా ఎన్నో పోషకాలు పెరుగు లో ఉంటాయి. పెరుగు తినడం వలన మనకు పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Advertisement

Also Read: చికెన్‌తో పాటు ఏయే ఆహార‌ప‌దార్థాల‌ను తీసుకోకూడ‌దో మీకు తెలుసా..?

పెరుగు తినడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది పెరుగు. ఎముకలు, దంతాలను కూడా బలపరుస్తుంది. వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రక్త పోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరంలో కార్టిసాల్ లేదా ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. అతిసారం లక్షణాల చికిత్సకు సహాయపడుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. పెరుగును దాని రుచి ఆధారంగా కొన్ని వర్గాలుగా విభజించారు. తీపి పెరుగు, పుల్లని పెరుగు, పాక్షికంగా ఏర్పడిన పెరుగు అని.. ఇలా రుచిని బట్టి రక రకాలుగా వర్గీకరించారు.

Advertisement

ముఖ్యంగా పెరుగును ఎక్కువగా పగటిపూట సమయంలో తిన్నప్పుడు మాత్రమే ఆరోగ్య ప్రయోజనాలను సమృద్ధిగా అందిస్తుంది. రాత్రి సమయంలో పెరుగును తిన్నప్పుడు దాని తీపి, పుల్లని లక్షణాల కారణంగా శరీరంలోని పిత్తం మరియు కఫంలను పెంచుతుంది. రాత్రి వేళలో శరీరం యొక్క కఫం, పిత్తం సహజంగా పెరుగుతాయి. అయితే ఉబ్బరం, మైకం వంటి ఖాళీ , గాలి వంటి అంశాలకు సంబంధించి.. వాత దోషము లేదా దోషాలను తగ్గించినప్పటికీ పెరుగు తీసుకోవడం వల్ల శరీరంలో రెండు దోషాలు మరింత పెరుగుతాయి సింపుల్ గా చెప్పాలంటే రాత్రి సమయంలో జీర్ణ వ్యవస్థ, శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థలను బలహీనపరుస్తుంది. రాత్రిపూట శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే వైద్యులు వేడిగా ఉన్న పెరుగు వంటి ఆహారాన్ని నివారించాలని సూచిస్తారు.

శరీర బరువు పెరుగుతుంది. ముక్కు దిబ్బడ, ప్రేగు కదలిక నెమ్మదించడం, అతిసారము, ఆమ్లత్వం, జిడ్డుగల చర్మం, అలర్జీ వంటివి శరీరంలో కఫం దోషం పెరిగితే ఈ లక్షణాలు కనిపిస్తాయి. అదేవిధంగా హార్మోన్ల అసమ తుల్యత, ఆకలి పెరగటం, జుట్టు రాలడం, గొంతు మంట, చెడు శ్వాస, రుతుస్రావం సమయంలో నొప్పి రావటం, నిద్రలేమి వంటివి శరీరంలో పిత్తం దోషం పెరుగుతే వచ్చే లక్షణాలుగా కనిపిస్తాయి. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులు లేదా దగ్గు, జలుబుకు గురయ్యే వ్యక్తులు కఫం, పిత్తం అసమతుల్యత కారణంగా దుష్ప్రభావాలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని చెబుతున్నారు. శక్తి బలంగా ఉన్న వాడు ఈ లక్షణాలను అనుభవించక పోవచ్చు. వారు మోతాదులో రాత్రిపూట పెరుగును తీసుకోవచ్చు. రాత్రిపూట పెరుగు తినాలి అనుకునేవారు పరుగులు బదులు మజ్జిగ తీసుకోవడం బెటర్. అందుకోసమే రాత్రిపూట పెరుగు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తుంటారు.

Also Read:  11 మందితో పెళ్లి, పక్క పక్క వీధుల్లో కాపురం..హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చిన నిత్య పెళ్ళికొడుకు భాగోతం…!

Visitors Are Also Reading