మనం సాధారణంగా పల్లెటూర్లలో ఈ సామెతను వింటుంటాం.. అదే ఇంత ఏజ్ వచ్చిన ఏం పని చేయకుండా ఊరిమీద పడి అచ్చోసిన ఆంబోతులా తిరుగుతున్నాడని అంటుంటారు. మరి ఆ ఎద్దుల నే ఉదాహరణగా ఎందుకు తీసుకుంటారు. ఇందులో ఆంబోతు మరియు ఎద్దు 2 పుట్టినప్పుడు కోడె దూడలే కదా. ఇవి కూడా ఆవుకే పుడతాయి.. కోడె దూడలు అంటే మగవి.. పెయ్య దూడలు అంటే ఆడవి.. అయితే పుట్టినప్పుడు కోడెదూడలుగా ఉన్న వాటిలో కొంతకాలం తరువాత కొన్ని ఎద్దులు అయితే .. మరికొన్ని ఆంబోతులు అవుతాయి.
Advertisement
అయితే వ్యవసాయంలో మాత్రం రైతులకు ఆసరాగా ఉండేవి పొలం దున్నడానికి ఉపయోగపడేవి బండి నడపడానికి సహాయపడేది మాత్రం ఎద్దులే.. ఎలాంటి కష్టం కూడా చేయకుండా చక్కగా తిని తిరిగేవి ఆంబోతులు.. అయితే సాధారణంగా పల్లెటూర్లలో పెళ్లిళ్లు శుభకార్యాలు జరిగేటప్పుడు కొంతమంది కోడెదూడను శంకు చక్రాల ముద్రవేసి వాటిని దేవుని పేరు మీద వదిలేస్తూ ఉంటారు. అప్పటి నుంచే కోడెదూడలు ఆంబోతులా తయారవుతాయి.. దాన్ని ఏ దేవునికి మొక్కు బడిగా భావిస్తామో దానికి స్వరూపంగా అనుకుంటారు. కొన్ని గ్రామాల్లో మాత్రం ఆంబోతుల కోసం ప్రత్యేకంగా ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం తవుడు మరియు వేరుశనగ అచ్చు వంటివి ఆహారంగా పెడుతూ ఉంటారు. ఈ రోజు ఏ సమయానికి ఆహారం దానికి పెడతారో.. అదే సమయంలో మళ్లీ వస్తూ ఉంటుంది.. కొందరేమో పొలాల దగ్గర కూడా ఆంబోతుల కోసం ప్రత్యేకంగా పశుగ్రాసాన్ని పెడతారు.. అయితే ఈ ఆంబోతు లను దైవ స్వరూపంగా భావించడం వల్ల దాన్ని ఎవరూ ఏమీ అనరు.. ఎప్పుడైనా అల్లరి చేస్తుంటే అది వెళ్లిపోవడానికి దానిపై పసుపు నీళ్లు చల్లుతారు. ఈ ఆంబోతులు పొలాల మీద పడి తినేస్తున్న కొట్టడానికి మాత్రం సహకరించారు. దీనికి కారణాలు రెండు ఉన్నాయి.. ఒకటి దైవస్వరూపంగా చూడటం.. రెండోది దానికి కోపం వచ్చి రంకే వేసిందంటే ఎదురుగా ఎవరు వస్తే వారిపై దాడి చేస్తుంది. అందుకే దాన్ని కొట్టడానికి ఎవరు సాహసం చేయరు అని చెప్పవచ్చు.
Advertisement
ALSO READ;
ఇప్పటికీ మీతోనే అన్నా అంటూ సీఎం జగన్ పాత ఫోటో షేర్ చేసిన శ్రీరెడ్డి…నెట్టింట వైరల్…!
నా అనుకున్న వాళ్లచేతిలోనే దారుణంగా మోసపోయి రొడ్డునపడ్డ స్టార్ హీరోయిన్ లు….!