ఐపీఎల్ 2022 లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు చేసిన పని వైరల్ గా మారింది. అయితే ఈ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆంతగా.. రాణించకుంట అభిమానులను ఇబ్బంది పెడుతుంటే… వారికి మరో షాక్ ఇచ్చాడు రాయుడు. తనకు ఈ ఐపీఎల్ లాస్ట్ ఐపీఎల్ అని.. తాను ఈ ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాను అని పేర్కొన్నాడు.
Advertisement
తన ట్విట్టర్ లో… ”ఐపీఎల్ లో ఇదే నా చివరి సీజన్ అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఐపీఎల్ లో ఎంతో విజయవంతమైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించినందుకు నేను సంతోషితున్నాను. ఆ రెండు జట్లతో నాకు గొప్ప క్షణాలు ఉన్నాయి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆ రెండు జట్లకు నా ధన్యవాదాలు” అని పేర్కొన్నాడు. అయితే ఈ ట్విట్ చేసిన 10 నిమిషాల్లోనే మళ్ళీ దానిని డిలీట్ చేసాడు రాయుడు. దాంతో రాయుడు ఎందుకు ఇలా చేసాడు అనే దానిపైన పెద్ద చర్చనే జరిగింది.
Advertisement
అయితే అనంతరం రాయుడు చేసిన ట్విట్ పై వెంటనే చెన్నై జట్టు స్పందించింది. రాయుడు వచ్చే ఏడాది కూడా ఆడుతాడు అని పేర్కొన్నది. వచ్చే ఏడాది కూడా రాయుడు తన జట్టుతోనే ఉంటాడు అని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ పేర్కొన్నాడు. అయితే ఈ ఐపీఎల్త లో అంబటి రాయుడు తన ఆట సంతోషంగా లేడని, అందుకే కొంత మనస్థాపానికి గురై ఉంటాడని కాశీ విశ్వనాథ్ పేర్కొన్నారు. ఎవరికైనా సరే కొన్ని సందర్భాల్లో ఈ ఒడిదుడుకులు తప్పవని.. రాయుడు ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు అని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి :
కోహ్లీ నవ్వు అనుష్కకి నచ్చడం లేదా…?
బీసీసీఐకి ఎదురు తిరుగుతున్న కస్టమర్లు…!