ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాలైనటువంటి స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఫోన్ తనకంటూ ఓ ప్రత్యేక యూజర్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది. తాజాగా మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది ఈ కంపెనీ. వన్ ప్లస్ నార్డ్ 2 టీ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ఉండనుంది. ఈ ఫోన్లో పలురకాల ఫీచర్లను కంపెనీ యాడ్ చేసింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఫోను కేవలం యూరోప్ మార్కెట్ లోనే విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కు 399 యూరోలుగా ధరను నిర్ణయించారు.
Advertisement
భారత రూపాయలలో ఈ ధర రూ. 32,100 ఉండనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం తో పని చేయనున్నది. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.43 అంగుళాల ఎమోల్డ్ డిస్ ప్లే అందజేశారు. ఇది మీడియాటెక్ డైమన్ సిటీ 1300 ఎస్ఓపీ ప్రాసెసర్ వర్క్ చేయనున్నది. వన్ ప్లస్ నార్డ్ 2 టీ స్మార్ట్ ఫోన్ విషయానికొస్తే.. అదిరిపోయే రేంజ్ లో కెమెరాన్ అందజేశారు. ఈ స్మార్ట్ ఫోన్లో 50 ఎంపీ రియర్ కెమెరాను అందజేసారు.
Advertisement
అందమైన ఆకర్షణీయమైన సెల్ఫీల కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఇందులో ఉన్నది. ఈ 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో సెల్ఫీలు దిగడం చాలా ఈజీ అవుతుంది. ఈ ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 4500 ఎంఏహెచ్ సామర్థ్యం కల బ్యాటరీని అందజేసారు. ఈ ఫోన్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనున్నది. తక్కువ ధరలో ఎన్నో ఫీచర్లు అందజేసిన ఈ స్మార్ట్ ఫోన్ భారత్‌లో కనుక విడుదల అయితే చాలా మంది టెక్ ప్రియులు ఈ ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు చూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read :
F3 ట్రైలర్ విడుదల.. చూస్తే మాత్రం నవ్వు ఆపుకోలేరు..!
పెరుగుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. చుండ్రుకు కూడా చెక్ పెట్టొచ్చా..!!