రైలులో ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో చైన్ లాగడం సర్వసాధారణమే. కానీ కొంత మంది కావాలని లాగడం.. మరికొంత మంది ఇష్టానుసారంగా వ్యవహరించడం జరిగిపోతుంది. ఇక్కడ ఓ రైలు ప్రయాణికుడు చైన్ లాగిన సందర్భంలో లోకోపైలట్ ప్రాణం మీదికి వచ్చింది. ఈ ఘటన ముంబై నగరానికి సమీపంలో చోటు చేసుకుంది. ముంబై నుంచి బీహార్‌లోని ఛాప్రాకు వెళ్తున్న గోదాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ చైన్ లాగాడు. దీంతో ముంబైకి 80 కిలోమీటర్ల దూరంలో ఒక నది వంతెనపై ఆ రైలు అకస్మాత్తుగా ఆగింది. చైన్ లాగిన రైలు బోగి కింద ఉన్న అలారం పరికరాన్ని తిరిగి సెట్ చేస్తేనే ఆ రైలు కదులుతుంది.
Advertisement
అయితే ఆ బోగి కింద ఉన్న అలారం పరికరాన్ని తిరిగి సెట్ చేయడానికి సీనియర్ అసిస్టెంట్ లోకో ఫైలట్ సతీష్‌కుమార్ చాలా రిస్క్ తీసుకున్నారు. రైలు ఇంజిన్‌లో ఉన్న ఆయన అతికష్టం మీద చివరన ఉన్న రైలు బోగికి చేరుకున్నారు. వంతెనపై రైలు ఆగి ఉండడంతో ధైర్యం చేసి రైలు బోగి కిందకు వెళ్లి అక్కడ ఉన్న అలారం పరికరాన్ని తిరిగి సెట్ చేసారు. రైల్వే మంత్రిత్వ శాఖ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రైలు చైన్‌ను లాగాలని ట్విట్టర్లో వెల్లడించింది.
Advertisement
Dedication!
Rectifying ‘Chain Pull’ brake on the bridge. pic.twitter.com/L6VgOfjCeq
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 7, 2022
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లోకో ఫైలట్ సాహసం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలే పోయేవిధంగా అక్కడ పరిస్థితి ఉంది. అయినప్పటికీ బెదరకుండా.. రైలును స్టార్ట్ చేసేందుకు అతను చేసిన ప్రయత్నంపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను చూసి ఆనందించండి.
Also Read :
Anchor Suma : యాంకర్ సుమకు తప్పిన ప్రమాదం..ఎలాగంటే..?
Sarkaru Vaari Paata: అదరగొడుతున్న మమ మహేషా ఫుల్ సాంగ్..!