నాన్నకు ప్రేమతో సినిమాలో తారక్,సుకుమార్ చెప్పినట్లు ఎక్కడో జరిగిన లోపమే ఇంకెక్కడో జరగాల్సిన మూమెంట్ ను ప్రభావితం చేస్తుంది అన్నట్లు అప్పుడప్పుడు దర్శకుడు కొరటాల శివ చేసిన పని ఇప్పుడు జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారు అంటూ ఓ సినిమా లాజిక్ అనుకుంటున్నారు నెటిజెన్స్. అయితే ఇదంతా ఆచార్య సినిమా ఫలితం గురించే అని అర్థమవుతుంది. ఆచార్య సినిమా ఒక్కటే కాదు ట్విట్టర్ అకౌంట్ గురించి కూడా చెప్పవచ్చు. ఆచార్య సినిమా సెట్స్ మీద ఉండగా కొరటాల శివ తన ట్విటర్ ఖాతా ను క్లోజ్ చేసాడు. అలా ఎందుకు క్లోజ్ చేసాడు ఏమైంది అంటూ కొన్ని రోజులు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆ టైంలో నోరుమెదపని కొరటాల శివ మొన్నీమధ్య నోరు విప్పారు. సోషల్ మీడియా అవసరమే కానీ లేనిపోని నెగిటివిటీ ఎక్కువైందని, అందుకే దాని నుంచి తప్పుకోవడానికి బయటికి వచ్చేసాను అని కొరటాల చెప్పారు. కానీ కొరటాల శివ ను అంతలా సోషల్ మీడియాలో ఎవరూ టార్గెట్ చేసింది లేదు. దీంతో కొరటాల శివ కి ఏదో జరిగింది అనే ప్రశ్న అలాగే మిగిలిపోయింది. అయితే ఆచార్య సినిమా ఫలితం చూశాక కొరటాల తన సినిమా భవిష్యత్తును ఊహించి ముందుగానే ట్విట్టర్ నుంచి బయటికి వచ్చేసారా అనే ప్రశ్నలు ఇప్పుడు మొదలయ్యాయి. వినయ విధేయ రామ సినిమా మొదలైన తర్వాత సోషల్ మీడియా లో డైరెక్టర్ బోయపాటి శ్రీనుని ఓ ఆట ఆడుకున్నారు నెటిజన్స్. మీమ్స్,వీడియోస్, ఇంటర్వ్యూ బిట్స్ ఇలా ఏ ఒక్క దాన్ని కూడా వదల్లేదు. దీంతో ఆయన చాలా హర్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు కొరటాల పరిస్థితి కూడా బోయపాటి శ్రీనులా అయిపోయింది. ఆచార్య గురించి సోషల్ మీడియాలో మీమ్స్ జాతర జరుగుతోంది. ఒకవేళ ఇప్పుడు కొరటాల గనుక ట్విట్టర్లో ఉంటే ఆ మీమ్స్ నెగిటివిటీని చూసి ఆయన తట్టుకోలేరు అని అంటున్నారు ఆయన సన్నిహితులు. అయితే ఆచార్య ఫలితం ముందుగానే ఊహించి అలా చేశారా, లేక అనుకోకుండా అలా చేశారా అనేది తెలియాల్సి ఉంది. అయితే కొరటాల శివ బయటికి వస్తే మాత్రం ఈ విషయం అడిగి తెలుసుకోవాలి అన్నట్లు చూస్తున్నారట ఇండస్ట్రీ వర్గాలు. అయితే తారక్ మాత్రం తన సినిమాని ఇంకా కొంచెం టైం తీసుకొని మంచి కథ సిద్ధం చెయ్యి అని కొరటాలను సజెస్ట్ చేశారట.
Advertisement
ALSO READ :
Advertisement
విశ్వక్ సేన్-దేవి నాగవల్లి ఇష్యూ… కమెడియన్ ను పొగుడుతూ స్టార్ హీరోలను కడిగిపారేసిన
డబ్బు కోసం ఆ ఛానల్ ఎంతకైనా దిగజారుతుందటున్న ప్రముఖ కమెడియన్..!