Home » డబ్బు కోసం ఆ ఛానల్ ఎంతకైనా దిగజారుతుందటున్న ప్రముఖ కమెడియన్..!

డబ్బు కోసం ఆ ఛానల్ ఎంతకైనా దిగజారుతుందటున్న ప్రముఖ కమెడియన్..!

Ad

హీరో విశ్వక్ సేన్ ఓ టీవీ యాంకర్ మధ్య జరిగిన వివాదం రోజు రోజుకి ముదురుతోంది. ఈ వివాదంలో కొందరు యాంకర్ కి సపోర్ట్ చేస్తుండగా మరికొందరు హీరో విశ్వక్ సేన్ కి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే తాజాగా ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ సైతం హీరో విశ్వక్ సేన్ కి మద్దతుగా నిలిచారు. సదరు టీవీ ఛానల్ ను వరుస ట్వీట్ లతో ఏకిపారేస్తున్నారు. ట్వీట్ల సారాంశం ఏమిటంటే.. ఇప్పుడు జరుగుతున్న ఈ సర్కస్ ఫీట్లో నేను కూడా భాగం అవుదామనుకుంటున్నా, టీవీ స్టూడియో లో విశ్వక్ సేన్ ని అవమానించిన విధానాన్ని ఖండిస్తున్నాను. జర్నలిస్టుల ముసుగులో వీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆ చానల్ కేవలం డబ్బుల కోసమే న్యూస్ కవర్ చేస్తోంది. నీచమైన రూపం లో ఎంటర్టైన్ అందిస్తోంది. ప్రజలను ఆకట్టుకునేందుకు ఏమైనా చేస్తోంది. సదరు న్యూస్ ఛానల్ తప్పా మిగతావన్నీ న్యూస్ కవర్ చేస్తారని వాళ్లకు పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తాయంటూ సంచలన కామెంట్స్ చేశాడు రాహుల్ రామకృష్ణ. అంతేకాకుండా ఈ మొత్తం ఇష్యూపై సదరు టీవీ ఛానల్ వాళ్లు పిలిస్తే లైవ్ డిబేట్ లో పాల్గొంటా అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం రాహుల్ రామకృష్ణ చేసిన ఈ ట్వీట్స్ పెద్ద దుమారమే రేపేలా కనిపిస్తున్నాయి. మరి ఈ వ్యాఖ్యల పట్ల సదరు టీవీ ఛానల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisement

ALSO READ :

Advertisement

VishwekSen : “అశోకవనంలో అర్జున కళ్యాణం” రివ్యూ….! Review & Rating

 

హాస్పిటల్ బెడ్ మీద సమంత.. షాక్ లో నాగ చైతన్య..!

 

 

Visitors Are Also Reading