Home » నన్ను మతం మార్చుకోవాలని ఒత్తిడి చేసారు…!

నన్ను మతం మార్చుకోవాలని ఒత్తిడి చేసారు…!

by Azhar
Ad

ప్రస్తుతం మన ఇండియా టీంలో హిందూ, ముస్లిం ఆటగాళ్లు అందరూ ఉన్నారు. కానీ పాకిస్థాన్ జట్టులో మాత్రం కేవలం ముస్లిం ఆటగాళ్లే ఉన్నారు. అయితే అప్పట్లో పాక్ జట్టుకు కూడా హిందూ ఆటగాళ్లు ఆడారు. అలా ఆడిన అతి తక్కువ మంది ఆటగాళ్లలో స్పిన్నర్ డానిష్ కనేరియా ఒక్కడు. ఫిక్సింగ్ ఆరోపణలతో జట్టు నుండి బయటికి వచ్చిన కనేరియా ఇప్పుడు షాకింగ్ విషయాలను బయట పెడుతున్నాడు.

Advertisement

తాజాగా ఓ ఇంటర్వ్యూ లో కనేరియా మాట్లాడుతూ… నేను జట్టులో ఆడుతున్నప్పుడు షాహిద్ అఫ్రిది కెప్టెన్ గా ఉండేవాడు. నేను హిందువును అని అతను నాతో చాలా దురుసుగా ప్రవర్తించేవాడు. నేను ఎంత బాగా రాణించిన నన్ను మాత్రం బెంచ్ కే మరిమితం చేసాడు. జట్టులో స్థానం కావాలి అంటే నువ్వు మతం మార్చుకోవాలని నన్ను ఒత్తిడి చేసాడు అని కనేరియా ప్రకటించాడు.

Advertisement

ఇక నన్ను ఎప్పుడు హేళన చేసే ఆఫ్రిది.. మిగిత ఆటగాళ్లతో కూడా హేళన చేయించేవాడు. అయితే నాకు మద్దతుగా అందరికంటే ముందు షోయబ్ అక్తర్ నిలిచాడు. కానీ అతనికి పై నుండి ఒత్తిడి రావడం.. పోర్డు కూడా ఆఫ్రిదికే మద్దతు ఇవ్వడంతో అక్తర్ కూడా తర్వాత ఏం మాట్లాడలేదు అని కనేరియా వెల్లడించాడు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీకి వార్నర్ అద్భుతమైన సలహా…!

చెన్నై జట్టుకి ముంబై గ్రాండ్ వెల్కమ్..

Visitors Are Also Reading