ఇప్పుడు ఉన్న ప్రపంచంలో అమ్మాయిలకు అబ్బాయిలకు ఎవరు తేడా చూపించడం లేదు. అందరూ అందర్నీ సమానంగా చూస్తున్నారు. అయినప్పటికీ ఇద్దరికి కొన్ని విషయాలలో.. మరి ముఖ్యంగా వేసుకునే బట్టలో మాత్రం చాలా తేడా ఉంటుంది. అందులోనూ ఎక్కువగా అమ్మాయిల బట్టలకి పాకెట్స్ ఉండవు. ఒకవేళ ఉన్న అవి చిన్నగా ఉంటాయి. ఇలా ఉండటం వెనుక పెద్ద కారణమే ఉంది. అది ఏంటో తెలుసుకుందాం..!
Advertisement
అదేంటంటే… మధ్య కాలంలో అబ్బాయిలకు, అమ్మాయిలకు ఇద్దరి బట్టలకు పాకెట్స్ ఉండేవి కావు. అందుకే ఇద్దరి నడుము దగ్గర బ్యాగ్స్ ను ఉంచుకునేవారు. ఆ తర్వాత 17వ సెంచరీలో మగవారి బట్టలకు పాకెట్స్ అనేవి రావడం మొదలయ్యాయి. కానీ అమ్మాయిలకు కాదు. ఎందుకంటే.. మగవారు బయటికి వెళ్లి పని చేస్తారు.. కానీ ఆడవారు బయటకి వెళ్లారు కదా.. అని వారికీ పాకెట్స్ ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన ఫ్రెంచ్ రెవల్యూషన్ లో ఆడవారి డ్రెసింగ్ లో చాలా మార్పులు వచ్చాయి. అప్పుడే అమ్మాయిలకు పర్సులు అనేవి వచ్చాయి.
Advertisement
ఇక ఆ తర్వాత 1891 లో అమ్మాయిలకు బట్టలకు పకెంట్స్ ఇచ్చేవారు. కానీ చాలా చిన్నగా. అదే ట్రెండ్ ఇప్పటికి నడుస్తుంది. ఎందుకంటే దీని వెనుక ఓ బిజినెస్ ట్రిక్ ఉంది. అమ్మాయిలా బాట్టలు తాయారు చేసే కంపెనీలే వారి పర్సులను తాయారు చేస్తాయి. కాబట్టి వారికీ దేశాలకు పాకెట్స్ పెద్దగా ఇస్తే.. ఇక వారు హ్యాండ్ బ్యాగ్స్ ఎందుకు కొంటారు. అందుకే చాలా బ్రాండ్స్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ ను ఓ ఫ్యాషన్ లా క్రియేట్ చేసి.. విడిగా చాలా ధరకు అమ్ముతూ లాభాలు ఆర్జిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
ఎన్నో జట్లకు అవకాశం ఉన్న నన్ను అందరూ పక్కన బెట్టారు..!
కోహ్లీకి వార్నర్ అద్భుతమైన సలహా…!