Home » ఎన్నో జట్లకు అవకాశం ఉన్న నన్ను అందరూ పక్కన బెట్టారు..!

ఎన్నో జట్లకు అవకాశం ఉన్న నన్ను అందరూ పక్కన బెట్టారు..!

by Azhar

2008 లో భారత జట్టుకు అండర్-19 ప్రపంచ కప్ గెలిపించిన కెప్టెన్ గా విరాట్ కోహ్లీకి మంచి పేరు వచ్చింది. ఇక అదే ఏడాది బీసీసీఐ ఐపీఎల్ ను ప్రారంభించడంతో కోహ్లీని తీసుకునే అవకాశం అన్ని జట్లకు ఉంది. మరి ముఖ్యంగా కోహ్లీ ఢిల్లీ ఆటగాడు కాబట్టి అతడిని ఆజట్టే తీసుకుంటది అని చాలా మంచి అనుకున్నారు. కానీ వేలంలో కోహ్లీని ఢిల్లీ కాకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు తీసుకుంది.

ఇక తాజాగా ఈ విషయం పై కోహ్లీ మాట్లాడుతూ.. ఐపీఎల్ మొదట్లో నన్ను తీసుకునే అవకాశం అన్ని జట్లకు ఉంది.. కానీ వారందరు నన్ను పక్కన బెట్టారు. కానీ బెంగళూర్ జట్టు నన్ను తీసుకొని 2011 వరకు అంటే మొదటి మూడు సీజన్ లు వారు నాకు ఇచ్చిన అవకాశాలను మద్దతును నేను మరిచిపోలేను అని కోహ్లీ అన్నాడు. అయితే ఈ జట్టుకు 2013 లో కెప్టెన్ గా నియమితుడైన కోహ్లీ గత ఏడాది వరకు ఆ బాధ్యతలు నిర్వర్తించాడు.

అయితే ఐపీఎల్ 2022 మెగవేలంలో నా పేరును నమోదు చేసుకోమని… బెంగళూర్ జట్టుకు రిటైన్ ప్లేయర్ గా వెళ్ళవద్దు అని నాకు చాలా మంది చెప్పారు. కానీ నేను వారి మాట వినకుండా నా మనసు మాట విన్నాను అని కోహ్లీ అన్నాడు. ఇక బెంగళూర్ జట్టుకు ఓ ఐపీఎల్ టైటిల్ గెలవకపోవడం పై తనకు ఎలాంటి భాధ లేదు అని… తన వెనుక ఎవరు ఎన్ని మాట్లాడుకునే అవి పట్టించుకోని అని కోహ్లీ అన్నాడు.

ఇవి కూడా చదవండి :

ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికే ఇచ్చిన లిటిల్ మాస్టర్..!

కోహ్లీకి వార్నర్ అద్భుతమైన సలహా…!

Visitors Are Also Reading