భారతీయ తత్వాన్ని ప్రపంచంలో ఉన్న నలుదిక్కులు కీర్తిస్తాయంటే ఆ గొప్పతనం మన సనాతన ధర్మానిదే. అందులో ముఖ్యమైన భాగం భక్తి. దేవుళ్ళకు గుళ్ళు కడితే పర్వాలేదు కానీ ఇష్టమైన హీరోయిన్లు, రాజకీయ నాయకులు అంటూ రోజురోజుకు గుడులు నిర్మిస్తున్నారు. అంతేకాదు కొన్ని చోట్ల ఇతర జీవులు అయిన కప్ప,దోమలకు కూడా గుడులు కడుతున్నారు. జంతువులకు గుళ్ళని ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఇంత విచిత్రమైన ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందామా..దోమకు గుడి.. ఇది వినడానికి మనకు చాలా విచిత్రంగా, హాస్యాస్పదంగా ఉండొచ్చు.కానీ ఇది నిజం. ఈ గుడి ఎక్కడో లేదు మన హైదరాబాద్ పరిసర ప్రాంతాంలో దీన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని ఓ డాక్టర్ నిర్మించారు. దోమ కాటు వల్ల వచ్చే వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో ఎమ్.సతీష్ రెడ్డి అనే డాక్టర్ దోమకు గుడి కట్టించారు. 2008 లో నిర్మించిన ఈ మందిరానికి ఖర్చు 5000 రూపాయలు.ఇక ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ జిల్లా కు చెందిన ఆయల్ లో కప్పకు గుడి కట్టించారు. దేశంలో కప్ప గుడి ఉన్న ఏకైక ఆలయం ఇది. ఇక్కడ కప్పలను పూజిస్తారు. మండూక తంత్రం ఆధారంగా ఈ గుడిలో శివాజీ కప్ప వెనుక భాగంలో కూర్చుని ఉంటారని అక్కడి ప్రజల నమ్మకం. రెండు వందల ఏళ్ల నుంచి ఉన్న కప్ప మందిరాన్ని వరదలు, కరువుకాటకాల నుంచి బయటపడేందుకు గాను నిర్మించారు. ఈ గుడిలో నంది విగ్రహం నిల్చొని ఉంటుంది. ఈ కప్ప ఆలయంలో శివలింగం కూడా ఉంది. ఈ లింగం రంగు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందట.
Advertisement
ALSO READ :
Advertisement
చెల్లి దారిలోనే చందమామ…సినిమాలకు ఇక సెలవు…!
జయప్రద-శ్రీదేవిల మధ్య గొడవకు కారణం.. ఆమె మాటలేనా.. అంత దారుణంగా..!!