Home » Karthika Deepam 4 May Today Episode : హిమ‌ను ప్రేమిస్తున్నాన‌ని నిరుప‌మ్ జ్వాల‌తో చెబుతాడా..? జ‌్వాల ఏం చేస్తుందంటే..?

Karthika Deepam 4 May Today Episode : హిమ‌ను ప్రేమిస్తున్నాన‌ని నిరుప‌మ్ జ్వాల‌తో చెబుతాడా..? జ‌్వాల ఏం చేస్తుందంటే..?

by Anji
Ad

కార్తీక దీపం సీరియ‌ల్ ఇవాళ అన‌గా మే 4, 2022 బుధ‌వారం ఎపిసోడ్ 1343 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిరుప‌మ్‌ను క‌లిసేందుకు జ్వాల వెళ్లుతుండగా అక‌స్మాత్తుగా ఆటో ఆగిపోతుంది. జ్వాల‌కు ఏమి చేయాలో తోచ‌దు. ఎవ‌రూ లిప్ట్ ఇవ్వ‌రు. ఇంత‌లోనే సౌంద‌ర్య కారు వ‌స్తుంది. సౌంద‌ర్య కారు అని తెలియ‌క వెళ్లి రోడ్డుకు అడ్డంగా నిలుచుంటుంది జ్వాల‌. తీరా చూస్తే అది సౌంద‌ర్య కాదు. నువ్వు ఏంటి రోడ్డుకు అడ్డంగా నిల‌ప‌డ్డావు అని అడుగుతుంది. హ‌లో సీనియ‌ర్ సిటిజ‌న్ అంటుంది జ్వాల‌. అర్జెంట్‌గా పోవాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది సీనియ‌ర్ సిటిజ‌న్‌. నిన్ను ముద్దుగా ఇక నుంచి సీసీ అంటాను ఓక నా అని జ్వాల అంటుంది.

లిప్ట్ అడ‌గ‌గానే ఎందుకు అని అడిగి.. చివ‌రకు డీజిల్ ఇస్తుంది సౌంద‌ర్య‌. దీంతో డీజిల్‌ను తీసుకొని జ్వాల‌ త‌న ఆటోలో పోసుకుంటుంది. సౌందర్య అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది. మ‌రొక వైపు స్వ‌ప్న త‌ల‌ప‌ట్టుకుని కూర్చుంటుంది. త‌ల‌నొప్పిగా ఉంద‌నుకుంటుంది. ఒంట్లో కూడా నీర‌సంగా ఉంద‌నుకుంటుంది. ఇంత‌లోనే కింద‌ప‌డ‌బోతుంటే సౌంద‌ర్య వ‌చ్చి ప‌ట్టుకుంటుంది. వ‌దులు మ‌మ్మీ అంటుంది స్వ‌ప్న‌. ఇప్పుడు కూడా పంత‌మేనా.. ప‌దా లోప‌లికి అంటుంది. నువ్వు ఎందుకు వ‌చ్చావు అంటుంది స్వ‌ప్న‌. నేను నిన్ను చూడాల‌ని, నీతో మాట్లాడాల‌ని వ‌చ్చాన‌ని సౌంద‌ర్య చెబుతుంది. ఇల్లు అంటే అంద‌రుండాలి స్వ‌ప్న‌. ఇప్పుడు నీకు ఏదైనా అయితే ప‌రిస్థితి ఏమిటి..? ఒంట‌రిగా ఉంటే ఇల్లు అన‌రు. దానిని సంసారం అని కూడా అన‌రంటుంది సౌంద‌ర్య‌.

Advertisement

Advertisement

మ‌రొక‌వైపు నిరుప‌మ్ చెప్పిన అడ్ర‌స్‌కు జ్వాల వెళ్తుంది. ఇంత‌లో నిరుప‌మ్ వ‌స్తాడు. టీ ఆర్డ‌ర్ చేస్తాడు. ఆ త‌రువాత నిరుప‌మ్ త‌న‌కు ఏదో చెప్పాల‌నుకుంటాడు. కానీ చెప్ప‌లేక‌పోతున్నాడు. జ్వాల మాత్రం త‌న‌కు నిరుప‌మ్ ఐల‌వ్ యూ చెబుతాడేమోన‌ని అనుకుంటుంది. ఇద్ద‌రం క‌లిసి ఒకే టీ తాగుదాం.. స‌గం స‌గం తాగుదాం అని అనుకుంటుంది జ్వాల‌. మ‌రొక‌వైపు స్వ‌ప్న నిద్ర‌పోతుంది. త‌న‌నే చూస్తు కూర్చుంటుంది సౌంద‌ర్య‌. త‌న‌ను చూసి స్వ‌ప్న చిరాకు ప‌డుతుంది. అన్ని బాగుంటేనే మ‌న పంతాలు, పౌరుషాలు ఉంటాయి స్వ‌ప్న అని సౌంద‌ర్య అంటుంది. మ‌నం ఆరోగ్యంగా లేక‌పోతే మ‌న‌కు తోడు అవ‌స‌రం ఉంటుంది. అందుకే మ‌న పెద్ద‌లు కుటుంబ వ్య‌వ‌స్థ‌ను అందించారు అని సౌంద‌ర్య అంటుంది.

ప్ర‌స్తుతం నీ ప‌రిస్థితిని చూసి నేనెదో దెప్పి పొడుస్తున్నాను అనుకోకు. ప్రేమ్, అల్లుడు అక్క‌డ‌.. నిరుప‌మ్ ఇక్క‌డ ఎందుకు స్వ‌ప్న‌.. నీకు అంత పంతం అంటుంది సౌంద‌ర్య‌. నేను నాకు న‌చ్చిన కోడ‌లును తెచ్చుకుంటాను. నా స‌మ‌స్య‌కు ప‌రిష్కార‌మ‌వుతుంది. నువ్వేమి నా మీద జాలి ప‌డాల్సిన అవ‌స‌రం లేదంటుంది. ఇంత‌లో హిమ అక్క‌డికి వ‌స్తుంది. హిమ‌ను కోపంగా చూస్తుంది స్వ‌ప్న‌. ఎందుకే అంత కోపంగా చూస్తావు అంటుంది సౌంద‌ర్య‌. నీకు బాలేద‌ని హిమ‌ను పిలిచానంటుంది. నీకు ట్రీట్‌మెంట్ చేస్తే ప్రాబ్ల‌మ్ ఏంటి..? ముందు నిరుప‌మ్ కు ఫోన్ చేశా. కానీ వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వ‌స్తుంది అంటుంది సౌంద‌ర్య. ఆ త‌ర‌వాత ఏమైంది అత్త‌య్య.. పొద్దున ఏం తిన్నావు అని అడుగుతుంది హిమ‌. నేను బాగానే ఉన్నాను. నాకు నువ్వు ఏమి ట్రీట్‌మెంట్ చేయాల్సిన అవ‌స‌రం లేదంటుంది స్వ‌ప్న‌. ఇక ఆ త‌రువాత ఏం జ‌రుగుతుందో తెలియాలంటే రేప‌టి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.

Also Read : 

Janaki Kalaganaledu 4 May Today Episode: జాన‌కిపై జ్ఞానాంబ సీరియ‌స్‌.. అంత‌లోనే పెద్ద ట్విస్ట్‌.. ఏం జ‌రిగిందంటే..?

శ్రీముఖి గురించి ఈ విషయాలు మీకు తెలిస్తే షాకవుతారు..ఆ బడా హీరోతో..!!

Visitors Are Also Reading