Home » మహిళలపై వ్యక్తిగత దూషణలు దారుణం…. అది అరాచక పాలన..ఎన్టీఆర్ ఫైర్..!

మహిళలపై వ్యక్తిగత దూషణలు దారుణం…. అది అరాచక పాలన..ఎన్టీఆర్ ఫైర్..!

by AJAY
Ad

నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు హాట్ టాపిక్ గా మారాయి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వైసీపీ నేతలు తన సతీమణి పై అసభ్య పదజాలంతో మాట్లాడరని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీని బైకాట్ చేశారు. అంతేకాకుండా తాను సీఎం అయ్యే వరకు అసెంబ్లీలో అడుగు పెట్టను అని చంద్రబాబు శపథం చేశారు. అనంతరం టిడిపి ఆఫీస్ లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి కంటతడి పెట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికే పలువురు ఈ ఘటనపై స్పందించారు.

Advertisement

ముఖ్యంగా నారా వారి కుటుంబం నుండి మరియు నందమూరి ఫ్యామిలీ నుండి ఒక్కొక్కరుగా చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ అసభ్య పదజాలం వాడిన నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కళ్యాణ్ రామ్, నారా రోహిత్ బాలయ్య, నందమూరి రామకృష్ణ సహా పలువురు చంద్రబాబు సతీమణి పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ…. “నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటన నన్ను చాలా కలచివేసింది. మహిళల పై వ్యక్తిగత దూషణలు చాలా దారుణం. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా వ్యక్తిగత దూషణలకు దిగితే అది అరాచక పాలన అవుతుంది. అలాంటి సంస్కృతి మనకు వద్దు. మన భవిష్యత్తు తరాలకు మంచి భరోసా ఇచ్చేలా రాజకీయ నాయకులు వ్యవహరించాలి.

Advertisement

ఇకనైనా ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి. స్త్రీలను గౌరవించడం మన కల్చర్ లో భాగం…. మన మాట వ్యక్తిత్వానికి నిదర్శనం. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ప్రజా సమస్యలపై ఉండాలి. నేను చంద్రబాబు నాయుడు కు చెందిన కుటుంబ సభ్యుడిగా మాట్లాడడం లేదు ఒక తెలుగువాడిగా దేశ పౌరునిగా మాట్లాడుతున్నాను. ఇకనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తారు అని ఆశిస్తున్నాను.” అంటూ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా మొదటి సారి ఎన్టీఆర్ సీఎం జగన్ పాలనపై అరాచక పాలన అంటూ సంచలన కామెంట్లు చేశారు.

https://twitter.com/tarak9999/status/1461999392764792832?t=ovymdiZFcARayB_gA3polw&s=19

Visitors Are Also Reading