సాధారణంగా దేవాలయాలలో ప్రసాదం అంటే స్వీట్, పులిహోర, లడ్డు, దద్దోజనం ఇలా పంపిణీ చేస్తుంటారు. కేవలం శాఖహారానికి సంబంధించినవే వినియోగిస్తుంటారు. ఎక్కడైనా దేవాలయాలలో అసలు మాంసాన్ని ఉపయోగించరు. హిందూ దేవాలయాల అన్నింటి కెల్లా చాలా విభిన్నమైన గుడి తమిళనాడులోని మునీశ్వరుని ఆలయం. ఈ దేవాలయంలో ప్రసాదముగా మటన్ బిర్యానీ పెట్టడం విశేషం. కేవలం దేవునికి మాత్రమే కాకుండా భక్తులకు కూడా ఎంత అడిగితే అంత అన్నట్టుగా పులిహోర పంచే విధంగానే మటన్ బిర్యానీ పంచుతుంటారు.
Advertisement
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలో ఉన్నటువంటి తిరుమంగళం సమీపంలో వడకంపట్టి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి మునీశ్వరుడు ఆలయంలో జనవరి 25 తారీఖున రెండు వేలకి కిలోల బాస్మతి రైస్ తో 500 కేజీల మటన్ తో బిర్యాని చేసి ప్రసాదంగా పంచుతారు. కేవలం గుడి నిర్వాహకులే కాకుండా చందాలు వేసుకొని బిర్యాని ప్రసాదాలు ఏర్పాటు చేయడం విశేషం. ఎక్కడలేని విధంగా తమిళనాడులో ఇలాంటి వింత ఆచారం ఉండడంతో అంతా కూడా దాని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మునీశ్వరుని గుడిలో బిర్యానీ పెట్టడానికి స్థానికులు ఓ కథ ఒక చెబుతుంటారు.
Advertisement
ఆ కథ ఏమిటంటే ఏళ్ల క్రితం సుబ్బానాయుడు అనే వ్యక్తి మునీశ్వర పేరుతో హోటల్లో ఏర్పాటు చేశాడట. ఆ హోటల్లో బిర్యాని కూడా అమ్మేవాడ ట. మంచి పేరు వచ్చింది. డబ్బులు కూడా బాగా సంపాదించాడు. ఆ హోటల్ ను మునీశ్వరుడు సక్సెస్ చేశాడనే నమ్మకంతో శ్వేత బిర్యానీ ప్రసాదము పెడుతూ వస్తున్నారు. ఆ ఏరియాలో ఉన్న వారందరూ బిర్యానీ అక్కడ మంచి పేరు రావడంతో మునీశ్వరుని కి శాశ్వత బిర్యానీ ప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ బిర్యాని ప్రసాదము కొందరు హిందువులు తప్పుబడుతున్నారు. కొందరైతే దేవుడు శాఖాహారమే తింటారు తనకు మాంసాహారం కావాలి అని చెప్పలేదు. అంటే కొందరేమో దేవుడికి ఏదైనా పెట్టొచ్చు శాఖాహారం మాంసాహారం అనే ఏమి చెప్పలేదు అని ఒకరికొకరు వాదించుకుంటున్నారు. 85 ఐదు సంవత్సరాల నుంచి మునీశ్వరుని కి, భక్తులకు బిర్యానీ ప్రసాదం లభిస్తుంది.
Also Read
“ఆచార్య” సినిమా ని ట్రోల్ చేస్తున్న “అల్లు అర్జున్” ఫాన్స్ ఎందుకో తెలుసా ?
తండ్రి మృతి పై హీరో నిఖిల్ ఎమోషనల్…కన్నీళ్లు పెట్టిస్తున్న పోస్ట్….!