టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో మహేష్‌బాబు, నమ్రత కపుల్స్ కూడ ఒకటనే సంగతి అందరికీ తెలిసినదే. పెళ్లి తరువాత నమ్రత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ మహేష్ కేరీర్‌లో సక్సెస్ సాధించడం కోసం నమ్రత ఎంతో కష్టపడుతున్నారు. ప్రముఖ యాక్షన్ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వం వహించిన వంశీ సినిమా షూటింగ్ సమయంలోనే నమ్రత, మహేష్‌లు ప్రేమలో పడ్డారు. ఓ ఇంటర్వ్యూలో బి.గోపాల్ మహేష్, నమ్రత గురించి మాట్లాడారు. అయితే ఆయన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
Advertisement
వంశీ సినిమాలో తొలుత నమ్రతను ఎంపిక చేయలేదని, మేకప్ టెస్ట్ చేస్తే హీరోయిన్ సెట్ కాకపోవడంతో ఆ తరువాత నమ్రతను ఎంపిక చేయడం జరిగిందని బి.గోపాల్ తెలిపారు.వంశీ సినిమా షూటింగ్ దాదాపు 40 రోజుల పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో జరిగిందని తెలిపారు. ఒక ట్రైన్‌లో కంపార్ట్‌మెంట్ బుక్ చేసుకుని ట్రైన్ గార్డును రిక్వెస్ట్ చేసి సీన్లు చేశామని బి.గోపాల్ చెప్పారు. విల్లింగ్ టన్ స్టేషన్‌లో అద్భుతంగా సీన్లు తీశాం అని, ఆ సినిమాలో పాటలు కూడ బాగున్నాయని బి.గోపాల్ తెలిపారు. వంశీ సినిమాలో ట్రైన్ సీన్లు తనకు ఎంతగానో నచ్చాయని దర్శకుడు చెప్పారు.
Advertisement
మహేష్, నమ్రతలు ప్రేమలో ఉన్నారని తనకు తెలియదు అని, న్యూజిలాండ్ షెడ్యూల్ సమయంలో మహేష్, నమ్రతలకు పరిచయం ఏర్పడిందని.. వాళ్లు ఒకరికొకరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారని బి.గోపాల్ వెల్లడించారు. ఊటి, కొడైకెనాల్, మున్నార్‌లలో ఎక్కువగా షూటింగ్‌లు చేశాం అని, కాశ్మీర్ అద్భుతమైన లొకేషన్ అని బి.గోపాల్ తెలిపారు. ఐదుసార్లు స్విట్జర్లాండ్, రెండు సార్లు కెనడాకు వెళ్లి షూటింగ్ చేశాం అని బి.గోపాల్ చెప్పారు. దర్శకుడు బి.గోపాల్ తెరకెక్కించిన ఆరడుగుల బుల్లెట్ సినిమా కొద్ది రోజుల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది.