Home » క‌రోనా పోర్త్ వేవ్ పిల్ల‌ల్లో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

క‌రోనా పోర్త్ వేవ్ పిల్ల‌ల్లో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

by Anji
Ad

క‌రోనా మ‌హ‌మ్మారి అంతం అయిందనుకున్న త‌రుణంలోనే మ‌ళ్లీ భార‌త‌దేశంలోని ప‌లు ప్రాంతాల్లో అంటువ్యాధుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఫోర్త్ వేవ్ గురించి భ‌యాల మ‌ధ్య‌, పిల్ల‌ల్లో క‌రోనా వ్యాప్తి చెంద‌డం పెద్ద ఆందోళ‌న‌లో ఒక‌టి. ఢిల్లీ, నోయిడా వంటి న‌గ‌రంలో కొత్త కేసుల‌లో దాదాపు పిల్ల‌ల్లోనే 75 శాతం కేసులు ఉన్నాయి. XE స‌బ్‌వేరియంట్ ఆవిర్భ‌విస్తున్న త‌రుణంలో ఇటీవ‌ల కేసుల సంఖ్య ఎక్కువ‌గా పెర‌గ‌డంతో విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌ను పునఃప్రారంభించాని కోరారు.


త‌ల్లిదండ్రుల ఆందోళ‌న‌లు స‌మ‌ర్థించ‌బ‌డుతున్న‌ప్ప‌టికీ క‌రోనా నిపుణులు వారిని శాంతి ప‌ర‌చ‌డానికి భ‌యాందోళ‌న‌లు త‌గ్గించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు గ‌మ‌నించిన ల‌క్ష‌ణాలు పిల్ల‌ల్లో సాపేక్షంగా తేలిక‌పాటివి ఇంకా త‌గిన చికిత్సతో స‌కాలంలో కోలుకున్నారు. క‌డుపునొప్పి, వాంతులు, విరేచ‌నాలు వంటి జీర్ణాశ‌యాంత‌ర స్వ‌భావం ఇంకా ప్లూ దాడుల్లో క‌నిపించే ల‌క్ష‌ణాల‌ను త‌ల్లిదండ్రులు గ‌మ‌నించాల‌ని ప్ర‌స్తుతం పిల్ల‌ల కేసుల‌తో వ్య‌వ‌హ‌రించే వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement

Advertisement

ఇక ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని ప్రాక్టిష‌న‌ర్లు గ‌త రెండు వారాల్లో ప్లూ లాంటి లక్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న పిల్ల‌ల ఫిర్యాదుల పెరుగుద‌ల‌ను గ‌మ‌నిస్తున్నార‌ని ఢిల్లీలోని సీకే బిర్లా ఆసుప‌త్రిలోని నియోనాటాల‌జీ అండ్ పీడియాట్రిక్స్ విభాగంలో డాక్ట‌ర్ గుర్లిన్ సిక్కా అన్నారు. పిల్ల‌ల్లో క‌రోనా చాలా తేలిక‌పాటి కేసుల‌తో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఎగువ శ్వాస‌కోశానికి సంబంధించిన ల‌క్ష‌ణాల‌ను కలిగి ఉంటాయి. ముక్కు కార‌డం, పొడి ద‌గ్గు, గొంతు నొప్పి,జ్వ‌రం, కొన్ని సంద‌ర్భాల్లో పిల్లలు వాంతులు లేదా విరేచ‌నాలు వంటి లక్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్నారు.

Also Read

వంట చేసిన‌ప్పుడు మీ చెయ్యి కాలితే ఇలా అస్స‌లు చేయ‌కండి..!

ECIL లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..!

Visitors Are Also Reading