2020 లో వచ్చిన కరోనా వైరస్ ఇంకా మనల్ని వదిలి పెట్టి పోలేదు. కరోనా కేసులు భారీగా రావడం.. ఆంక్షలు అమలు చేయడం.. అవి తగ్గుతున్న సమయంలో ఆంక్షలను ఎత్తి వేయడం.. మళ్ళీ ఆ తర్వాత పెరుగుతుంటే ఆంక్షలను తీసుకరావడం.. ఇదే ప్రక్రియ మన దేశంలో దాదాపు గత రెండేళ్లుగా కొనసాగుతుంది.
ఇప్పటికే మూడు కరోనా వేవ్ లు వచ్చి మొత్తం దేశాన్ని, ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలామ్ చేసాయి. వాటినుండి కోలుకుంటున్న సమయంలో ఇప్పుడు మళ్ళీ కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ అలాగే కేరళలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కరోనా ఆంక్షలను అమలులోకి తెచ్చారు.
ఇదే సమయంలో తెలంగాణలో కూడా కరోనా నియమాలను ఎత్తివేయలేదని… వైద్య ఆరోగ్య శాఖ తాజాగా తెలిపింది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా అందరూ మాస్కులు ధరించాల్సిందేనని… మాస్క్ లేకపోతే 1000 రూపాయల విధిస్తామని పేర్కొంది. అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో 20 నుండి 30 మధ్యలో కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి ఇప్పటినుంచే జాగ్రత్తగా ఉంటె మంచింది అని మన అధికారులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :