మామూలుగా మహిళలు సాయంత్రం గడిచిందంటే చాలు.. మహిళలు టీవీలో సీరియల్స్ చూస్తుంటారు. ముఖ్యంగా మాటీవీలో వచ్చే ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే ఈ సీరియల్ కు సంబంధించి ఇవాళ ఏపీసోడ్ తెలుసుకుందాం.
Advertisement
అల్లుడు అభిని కలిసి కూతురుపై ప్రేమను వ్యక్తపరిచి ఆవేదన చెందుతుంది. అయితే బాధలోనూ అర్థం ఉందని తెలుసుకున్న అభి.. ఆమె ఇచ్చిన త్రిబుల్ బెడ్‌రూం ఇంటి తాళాలను తీసుకుని నిర్ణయం కోసం కొంచెం సమయం అడుగుతాడు. ఈ ఇష్యూపై అభి, అంకితల మధ్య డిస్కషన్ నడవడం దానిని తులసి వినడం నిన్నటి ఎపీసోడ్‌లో జరిగిన ముచ్చట. ఇవాళ అనగా ఏప్రిల్ 19, 2022న ఏమి జరిగిందంటే.. నందు ఆఫీస్‌కు బయలు దేరుతూ లాస్యని తన ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తానని తొందరగా రెడీ అవ్వాలని చెబుతాడు. రెండు నిమిషాల్లోనే వచ్చేస్తా నందు అని పేర్కొంటుంది లాస్య. ఇంతలో నందుకు దివ్య కళాశాల నుంచి ఫోన్ వస్తుంది. రేపు పేరెంట్స్ మీటింగ్ ఉన్నదని.. మీతోపాటు తులసి గారికి కూడా సమాచారం ఇచ్చామని.. తప్పకుండా రావాలని చెబుతుంది ప్రిన్సిపాల్.
/ప్రిన్సిపాల్ ఆ మాట చెప్పగానే తులసి దొరికింది చెబుతా అని నందు అనుకుంటాడు. పక్కనే ఉన్న లాష్య ఏంటి నందు గర్ల్ ఫ్రెండ్ పోన్ చేసినట్టు అంత హుషారుగా ఉన్నావేంటి అని అడుగుతుంది. ఏం లేదు దివ్యకు పేరెంట్స్ మీటింగ్ ఉందట. తులసితో పాటు నన్ను కూడా రమ్మంటున్నారు అని చెబుతాడు. హో అందుకా అంత హ్యాపీగా ఉన్నావని లాస్య సెటైర్ వేయడంతో నువ్వు ఇక ఆపుతావా.. నాకు ఆనందం కాదు.. మగతోడు అవసరం లేదని గొంతు చించుకుని అరిచింది కదా.. ఇప్పుడు నా అవసరం పడింది. నన్ను పక్కన పెట్టుకుని దివ్య కాలేజ్‌కి వెళ్లాల్సిందే అంటాడు నందు.
మరోవైపు తులసికి కూడా దివ్య కాలేజ్ నుంచి ప్రిన్సిపాల్ ఫోన్ చేసి విషయం చెప్తుంది. పేరెంట్స్ మీటింగ్‌కి నంద గోపాల్‌తో కలిసి రావాలని చెప్తుంది. దీంతో తులసి ఆలోచిస్తుండగా.. పెద్దాయన పరందామయ్య ఏమైందని అడుగుతాడు. పేరెంట్స్ మీటింగ్‌కి మీ అబ్బాయితో కలిసి రావాలని అంటున్నారు అని చెప్పగా.. ఏం అవసరం లేదు.. నువ్వొక్కదానివి వెళ్తే చాల్లే అని అంటాడు పరందామయ్య. దీంతో తులసి.. కలిసి వెళ్లకపోతే దివ్య బాధపడుతుంది. పైగా ఆయనకి కూడా కాల్ చేసి చెప్పారట అని అంటుండగా.. ఇంతలో నందు దివ్యా.. దివ్యా అంటూ అరుచుకుంటూ వస్తాడు నందు.
ఇప్పుడు దానిని ఎందుకు పిలుస్తున్నారు అంటూ నందు దగ్గరికి వెళ్లి అంటుంది తులసి. పిలిచే హక్కు నాకు ఉంది. నీకు మగతోడు అవసరం లేకపోవచ్చు. కానీ దానికి తండ్రి అవసరం ఉంది అంటూ దివ్యను పిలుస్తాడు. ఇంతలో దివ్య రావడంతో దగ్గరకు తీసుకుని ఏం చేస్తున్నావ్ అమ్మా.. అని ప్రేమగా మాట్లాడతాడు. చదువుకుంటున్నా డాడీ అని దివ్య అనడంతో వెరీ గుడ్ చదువుకుంటేనే మంచి ఫ్యూచర్ లేదంటే.. కుట్టుమిషన్ తొక్కుకుంటూ బతకాలి అని తులసిని రెచ్చగొడతాడు. మీ అమ్మ నన్ను తండ్రి గుర్తించలేకపోయినా మీ కాలేజ్ వాళ్లు నన్ను తండ్రిగా గుర్తించారు.
Advertisement
అందుకే పేరెంట్స్ మీటింగ్‌కు పిలిచారు. చాలా సంతోషంగా ఉంది అమ్మా.. మీటింగ్ సమయానికి వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని అంటాడు నందు. ఆ మాటలు విన్న తులసి.. ఏమి అవసరం లేదు.. చూడు మిస్టర్ నంద గోపాల్ గారు.. దివ్య బాధ్యత నాది.. కేవలం నాది మాత్రమే.. మీరు పేరెంట్స్ మీటింగ్‌కు రావాల్సిన అవసరమే లేదు. దివ్యకి మీరు తండ్రి అనేది కాలేజ్ రికార్డుల వరకే.. చెప్పడం వరకే కాలేజ్ వాళ్ల బాధ్యత మీరు రావాలా వద్దా అన్నది నిర్ణయించాల్సింది నేను అని తులసి పేర్కొంటుంది. ఆ మాట వినగానే పక్కనే ఉన్న పరందామయ్య మంచి మాట చెప్పావ్ తల్లి.. తులసితో విడాకులు కాగానే.. పిల్లల బాధ్యత వదిలేశావ్. ఇప్పుడొచ్చి హక్కుల గురించి మాట్లాడుతున్నావ్ అంటూ కొడుక్కి చురకలు వేస్తాడు.
నాకు కావాల్సింది మీ నిర్ణయం కాదు.. దివ్య ఒపీనియన్ నేను పేరెంట్స్ మీటింగ్‌కు రావాలో వద్దో దివ్యనే చెబుతుంది. చెప్పమ్మా నేను పేరెంట్స్ మీటింగ్‌కు రావాలా అని అడుగుతాడు. దీంతో దివ్య తల్లిదండ్రుల వైపు జాలిగా చూస్తూ.. కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వు ఎవరికో భయపడాల్సిన అవసరం లేదు. నీ మనసు ఏది చెబితే అది చెయ్.. నువ్వు ఇప్పుడు తీసుకునే నిర్ణయం నీ లైఫ్‌లాంగ్ ఎఫెక్ట్ ఇస్తుందని గుర్తు పెట్టుకో అని నందు అంటాడు. నన్ను ఇప్పుడు వద్దనుకుంటే ఆ తరువాత కావాలని వచ్చినా పట్టించుకోను అని చెబుతాడు. ఆ మాటతో దివ్య యామ్ సారీ డాడ్.. నేను ఇప్పుడు మామ్ నీడలో బతుకుతున్న బిడ్డను తను ఏం చెబితే అదే చేస్తాను. మామ్ నిర్ణయమే నా నిర్ణయం అని చెబుతుంది. ఆ మాటతో తులసి ముఖం గర్వంతో వెలిగిపోతుంది.
దివ్యను మాయ చేశావు సరే.. రేపు మీటింగ్‌కు వెళ్లిన తరువాత దివ్య తండ్రి గురించి అడుగుతారు ఏమి చెబుతావు అని అంటాడు నందు. అబద్ధం చెప్పి తప్పించుకోవచ్చు. కానీ ఆ పని చేయను దివ్యకి నేను తప్ప ఎవరూ లేరు. కేవలం తల్లి మాత్రమే ఉందని చెబుతాడు. ఈ ప్రపంచంలో మొగుడు వదిలేసిన పిల్లలు లేరా..? వాళ్లు చదువుకోవడం లేదా..? నా కూతురుకు తండ్రి అని చెప్పి నాపై పెత్తనం చేస్తే ఎలా దూరం చేస్తున్నావ్. నీ సంగతి చూస్తాను. కథ ఇక్కడితో అయిపోలేదు అంటూ అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోతాడు నందు. ఆ తరువాత దివ్య తండ్రిని వద్దనుకున్నందుకు ఫీల్ అవుతూ ఉంటుంది. తులసి గమనించి ఓదార్చుతుంది. నువ్వు నా గురించి ఆలోచించకమ్మా.. నీ మనసుకు నచ్చింది చేయి నువ్వు డాడీ కావాలని అనుకుంటే ఇప్పేడే ఫోన్ చేస్తానని చెబుతుంద తులసి.
సంగీత దర్శకుడిగా అవకావం ఇవ్వడంతో ప్రేమ్ పాట రాయడం పూర్తి చేస్తాడు. శృతి దేవుడి దగ్గర ఆ పాటను పెట్టి అంతా మంచే జరుగుతుంది. మీ సంగీత దర్శకునికి ఆ పాట నచ్చుతుందని చెబుతుంది. మరో వైపు అభి తులసికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను ఆలోచించాల్సింది అమ్మ గురించి కాదు.. నా ఫ్యూచర్ గురించి ఎదగడం లేదనే కోపంతో కదా.. అమ్మ ప్రేమ్‌ని దూరంగా దూరం పెట్టింది. అలాంటప్పుడు నా స్వార్థం నేను చూసుకోవడంలో తప్పేంటి..? నా బాధను అమ్మ అర్థం చేసుకుని ఈ జైలు నుంచి విడుదల చేయిస్తే బాగుండు అని ఫోన్‌లో మాట్లాడుతుండగా తులసి మొత్తం వినేస్తుంది. మరి ఆమె రియాక్షన్ ఏమిటో రేపటి ఏపిసోడ్ చూడాల్సిందే..!
ఇవి కూడా చదవండి :
- నెక్‌డార్క్ ను పోగొట్టే అద్భుతమైన ఇంటి చిట్కా గురించి మీకు తెలుసా..?
- దాని వల్ల ఆరేళ్ల పాటు బాధపడ్డా…నెటిజన్లతో సమంత ఎమోషనల్ కామెంట్స్…!
- ఎన్టీఆర్ కొండవీటి సింహంలో చిరును తప్పించి మోహన్ బాబుకు ఛాన్స్…తెరవెనక కథ ఇదే..!