Home » బాలయ్య రౌడీ ఇన్స్ స్పెక్టర్ మూవీ పెద్ద హిట్ కు కారణం ఈ డైలాగేనా..!!

బాలయ్య రౌడీ ఇన్స్ స్పెక్టర్ మూవీ పెద్ద హిట్ కు కారణం ఈ డైలాగేనా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మా హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఆయనతో ఎంతో మంది దర్శకులు పనిచేసి ఎన్నో విజయాలు సాధించారు అయితే బాలయ్య సినీ జీవితంలో ఒక్కసారి డల్ అయిన సమయంలో తిరుగులేని విజయం. అందించి బాలకృష్ణును తెలుగు సినిమా ఇండస్ట్రీలో శిఖరాగ్రానికి చేర్చిన దర్శకుల్లో ఆనాడు బి.గోపాల్, ప్రస్తుతం బోయపాటి శ్రీను ఉన్నారని చెప్పవచ్చు. అయితే బాలయ్య గోపాల్ కాంబినేషన్ లో ఐదు మూవీస్ వస్తే నాలుగు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే ప్రస్తుతం బోయపాటి ది బాలయ్య కాంబినేషన్ కూడా ఇలాంటిదే గోపాల్ దర్శకత్వంలో..!
-లారీ డ్రైవర్
-రౌడీ ఇన్స్పెక్టర్
-సమరసింహా రెడ్డి
నరసింహ నాయుడు
-పల్నాటి బ్రహ్మ నాయుడు

వంటి సినిమాలలో ఒక్క సినిమా మాత్రమే ప్లాప్ అయింది. నరసింహ నాయుడు , సమరసింహా రెడ్డి బాక్సాఫీస్ ను షేక్ చేసాడు.. ఈ సందర్భంలోనే 1992లో వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్ మూవీ కూడా భారీ విజయం సాధించింది. విజయలక్ష్మి ఆర్ట్స్ మూవీ బ్యానర్ పై ఆనాటి అగ్ర నిర్మాత త్రివిక్రమ్ రావు నిర్మించిన ఈ మూవీలో విజయశాంతి కథానాయిక, బాలకృష్ణ పవర్ఫుల్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఇరగదీశారు. ఈ సినిమాలోని డైలాగులు ఆ సమయంలో థియేటర్లలో కేకలు పెట్టించాయట.

Advertisement

Advertisement

ఈ పోలీస్ డ్రెస్ తీసేస్తే.. నేను నీకన్న పెద్ద రౌడీనీరా..?

ఏ సెంటర్ కి వెళ్లి కొట్టుకుందాం చెప్పు..జగదాంబ.. సంఘం.. శరత్.. ఏదైనా సరే …అంటూ చెప్పే డైలాగ్ థియేటర్లలో కేకలు, విజిల్స్ తో దద్దరిల్లి పోయాయట.

ఈ మూవీ ఇప్పటికీ చెక్కుచెదరని రికార్డు తన ఖాతాలో వేసుకుందని చెప్పవచ్చు. ఆ రోజుల్లోనే 7.5 కోట్ల రూపాయల షేర్ కొల్లగొట్టి పలు కేంద్రాలలో 175 రోజుల పాటు కొన్ని చోట్ల రెండు వందల రోజులు కూడా ఆడింది. పరుచూరి బ్రదర్స్ రాసిన పవర్ ఫుల్ డైలాగులు, బాలకృష్ణ యాక్టింగ్, బి.గోపాల్ బాలకృష్ణ విజయశాంతి కాంబినేషన్ లో ఇవన్నీ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళయని చెప్పవచ్చు.

Visitors Are Also Reading