Home » పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఏడాదిలోపే ఎందుకు తీస్తారో మీకు తెలుసా..!!

పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఏడాదిలోపే ఎందుకు తీస్తారో మీకు తెలుసా..!!

by Sravanthi
Ad

పుట్టు వెంట్రుకలు తీయడం హిందూధర్మం ప్రకారం ఇదొక ప్రధాన ప్రాచీన సంస్కారం. పుట్టు వెంట్రుకలు సంవత్సరం పూర్తయ్యే లోపల గాని లేదా మూడవ సంవత్సరం,ఐదవ సంవత్సరంలో గాని తీయాలి. పుట్టు వెంట్రుకలు ఎందుకు సంవత్సరం లోపల తీయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు పిల్లవాడికి పుట్టు వెంట్రుకలు తియ్యకూడదు. ఎందుకంటే పుట్టు వెంట్రుకలు తీసే సమయంలో తల్లి ఒడిలో పిల్లవాడిని కూర్చో పెట్టుకోవాలి. గర్భ వతి గా ఉన్నప్పుడు ఒళ్ళో కూర్చో పెట్టుకోవడం కష్టమవుతుంది అందువల్ల అలా చేశారు.

Advertisement

ఇక పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు చాలా మందికి మొక్కుబడులు ఉంటాయి. తిరుపతి, వేములవాడ, యాదగిరి గుట్ట ఇలా దేవాలయ ప్రాంగణాల్లో పుట్టు వెంట్రుకలు తీస్తారు. ఈ పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు మేనమామ కూడా ఉండాలి. మొదటి కత్తెర మేనమామ చేతుల మీదుగా తీయాలి అంటారు. ఈ పుట్టు వెంట్రుకలు తీసే సమయంలో కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. సంవత్సరం వరకు పుట్టు వెంట్రుకలు ఎందుకు తీయరంటే తల మీద పిల్లలకు మాడు అని ఉంటుంది.

Advertisement

కనుక సంవత్సరంలోపు పిల్లలకు మాడు మీద కత్తిని ఉపయోగించడం వల్ల ప్రమాదవశాత్తు మెత్తగా ఉండే మాడు మీద ఏమైనా జరిగితే మెదడుకు ప్రమాదం కలుగుతుందనే ఉద్దేశంతో మన పూర్వీకులు సంవత్సరకాలం వచ్చేవరకు పుట్టు వెంట్రుకలు తీయకూడదనే ఆచారాన్ని ప్రవేశపెట్టారు. అయితే పుట్టు వెంట్రుకలు తీయడానికి ఒక ముహూర్తం కూడా నిర్ణయిస్తారు. పుట్టు వెంట్రుకలు తీయడానికి పంచాంగ శుద్ధి ఉండాలి. దానికి వారం, నక్షత్రం, తిథి అన్ని చూసి మంచి పంచాంగ శుద్ధి ఉన్న సమయంలో మాత్రమే ఈ పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి :

సుడిగాలి సుధీర్ సంపాద‌న ఎన్ని కోట్లో తెలుసా..?

కలలో చిన్నపిల్లలు కనిపిస్తే ఏం జరుగుతుందంటే..!!

ఆకులు.. వక్కలు.. పక్కలు.. ఇదేగా నీ బతుకు అంటూ.. బండ్ల గణేష్ పై విజయ సాయి రెడ్డి ఫైర్..!!

 

Visitors Are Also Reading