Home » సుడిగాలి సుధీర్ సంపాద‌న ఎన్ని కోట్లో తెలుసా..?

సుడిగాలి సుధీర్ సంపాద‌న ఎన్ని కోట్లో తెలుసా..?

by Anji
Ad

ఒక న‌టుడిగా టాలీవుడ్‌లో స్థిర‌ప‌డాలంటే అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. అందుకు ఎంతో క‌ష్ట‌ప‌డాలి, అయితే ఇవ‌న్ని జ‌ర‌గాలంటే అవ‌కాశాలు రావాలి. వ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని స‌రిగ్గా వాడుకుంటేనే ఒక న‌టుడిగా మంచి పేరు తెచ్చుకోగ‌ల‌రు. అయితే చాలా మంది ఏదో ఒక‌టి సాధించాల‌ని సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌స్తారు. కానీ అక్క‌డ జ‌రిగే ప‌రిస్థితుల‌కు త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌లిన వారే చ‌క్రం తిప్ప‌గ‌ల‌రు. చాలా చిన్న‌స్థాయి నుంచి ఎలాగైనా న‌టుడిగా మారాల‌ని వ‌చ్చిన న‌టుడు సుధీర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

sudheer

sudheer

సుడిగాలి సుధీర్ బుల్లితెర‌పై ఓ సంచ‌ల‌నమ‌నే చెప్పాలి. సుధీర్‌కు ఉన్న ఫ్యాన్స్ చూస్తే మ‌తిపోతుంది. అంత‌లా త‌న కామెడీ టైమింగ్ తో న‌ట‌న‌తో అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఇత‌ను ఈటీవీలో ప్ర‌తి గురువారం, శుక్ర‌వారం ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రాం ద్వారా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యారు. ఈ షో కి ఒక రేంజ్‌లో రేటింగ్ వ‌స్తుందంటే సుధీర్ పుణ్య‌మే అని చెప్ప‌వ‌చ్చు. యూట్యూబ్‌లో జ‌బ‌ర్ద‌స్త్ షో సుధీర్ స్కిట్స్‌ను రివైండ్ చేసుకుని చూసేవారు చాలా మంది ఉన్నారు.

Advertisement

Advertisement

అలా అంచెలంచెలుగా ఎదిగి నేడు టాప్ మోస్ట్ క‌మెడియ‌న్‌గా కొన‌సాగుతున్నాడు. నేడు జ‌బ‌ర్ద‌స్త్ వ‌ల‌న షోలు సినిమాల్లో మంచి అవ‌కాశాలు ద‌క్కించుకున్నాడు. అయిన‌ప్ప‌టికీ తాను ఎంత బిజీగా ఉన్న త‌న‌కు ఇండ‌స్ట్రీలో ఒక‌దారి చూపించిన జ‌బ‌ర్ద‌స్త్ ను మాత్రం వ‌దిలిపెట్ట‌లేదు. ఇందుకోసం ఈ ప్రోగ్రామ్ యాజ‌మాన్యం సుధీర్ కు బాగానే ముట్ట‌చెబుతోంది. ఈటీవీలో దాదాపు అన్ని షోలు సుధీర్ మీద‌నే ఆధార‌ప‌డ‌తాయ‌నే చెప్పాలి. ఇంత‌లా ఒక వైపు టీవ‌షోలు, మ‌రొక‌వైపు సినిమాల్లో బిజీగా ఉండే సుధీర్ ఒక సంవ‌త్స‌రానికి ఎంత సంపాదిస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

సుధీర్ ఒక ఏడాది సంపాద‌న ఇప్పుడు ఉన్న యువ హీరోలు కూడా అంత‌గా సంపాదించ‌లేర‌ని తెలుస్తోంది. మ‌ల్లెమాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సుధీర్ కు ఒక ఎపిసోడ్ రెండుల‌క్ష‌ల పారితోషికంగా ఇచ్చేవార‌ని స‌మాచారం. ఈవిధంగా చూసుకుంటే ఒక జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా సంవ‌త్స‌రానికి రూ.2కోట్ల 72 ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు. ఈటీవీలో వ‌చ్చే మ‌రొక షో డీ ద్వారా ఒక కోటి 36 ల‌క్ష‌లు సంపాదించాడ‌ట‌. ఇక ఆదివారం మాత్ర‌మే ప్ర‌సార‌మ‌య్యే శ్రీ‌దేవి డ్రామా కంపెనీ ద్వారా రెండు కోట్లు సంపాదిస్తున్నాడని స‌మాచారం. ఇక మిగిలిన అన్ని షోలు క‌లుపుకుంటే ఏడాదికి దాదాపు రూ.7కోట్లు సంపాదిస్తున్నాడ‌ని స‌మాచారం.

ఇవి కూడా చదవండి :

  1. విశాఖ వాసుల‌కు గుడ్‌న్యూస్‌.. అత్యంత త్వ‌ర‌లోనే మెట్రోరైలు
  2. ఐపీఎల్ or లవర్ : మీ సమాధానం ఏంటి..?
  3. టీంఇండియాకు కాబోయే కెప్టెన్ అతనే…?
Visitors Are Also Reading