Home » రాజస్థాన్ దగ్గరే అన్ని…

రాజస్థాన్ దగ్గరే అన్ని…

by Azhar
Ad

గత ఏడాది ఐపీఎల్ లో పాయింట్ల పట్టికలో చివరి నుండి రెండో స్థానంలో నిలిచినా రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2022 లో మంచి ఫామ్ లో ఉంది. మెగవేలంలో చాలా మంచి ఆటగాళ్లను వదిలేసిన రాజస్థాన్ మంచి మాంచి ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. అయితే ఈ జట్టు ప్రస్తుతం ఐపీఎల్ లో ఓ ప్రత్యేకతను కలిగి ఉంది. అదేంటంటే… ఐపీఎల్ 2022 లో ఇప్పుడు టేబుల్ టాపర్ గా ఉన్న ఈ జట్టు దగ్గరే పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ కూడా ఉన్నాయి.

Advertisement

Advertisement

అయితే ఇప్పటి వరకు ఐపీఎల్ లో నాలుగు మ్యాచ్లు ఆడిన రాజస్థాన్.. మూడింటిలో విజయం సాధించి 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. అలాగే ఈ జట్టు స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ వద్దనే పర్పుల్ క్యాప్ ఉంది. బట్లర్ ఆడిన నాలుగు మ్యాచ్ లలో 218 పరుగులు చేసాడు. అందులో ఒక్క సెంచరీ కూడా ఉంది. ఇప్పటి వరకు ఈ సీజన్ లో అథైధిక పరుగులు చేసింది బట్లరే. రెండో స్థానంలో ఉన్న అతనికి డికాక్ కు 30 పరుగుల తేడా ఉంది.

ఇక ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ దగ్గర ఉండే ఆరెంజ్ క్యాప్ కూడా రాజస్థాన్ దగ్గరనే ఉంది. ఆర్ఆర్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ నాలుగు మ్యాచ్ లలో 11 వికెట్లు తీసాడు. అయితే ఇలా అన్ని విభాగాల్లో ఒక్కే జట్టు ముందుడటం చాలా అరుదుగా జరిగే విషయం. ఈ జట్టు తర్వాతి మ్యాచ్ ఈనెల 14న గుజరాత్ టైటాన్స్ తో ఉంది. చూడాలి మరి ఆ మ్యాచ్ లో రాజస్థాన్ ఏం చేస్తుంది అనేది.

Visitors Are Also Reading