యాంకర్ సుమ లీడ్ రోల్ లో జయమ్మ పంచాయితీ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో యాంకర్ సుమ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ఇక మిగతా సినిమాలకు ప్రమోషన్స్ చేసేందుకు యాంకరింగ్ చేసే సుమ ఇప్పుడు తన సినిమా ప్రమోషన్స్ కోసం టీవీ షోలలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జబర్దస్త్ షోకు వచ్చింది.
Advertisement
దానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ప్రోమోలో యాంకర్ సుమ తనదైన పంచ్ లతో రెచ్చిపోయింది. ఇక వచ్చింది జబర్దస్త్ కు కాబట్టి సుమ పై కూడా పంచ్ లు గట్టిగానే పడ్డాయి. సుమ రాగానే యాంకర్ అనసూయ హగ్ ఇస్తూ వెల్ కమ్ చెప్పింది. ఆ తరవాత మంకీ వెంకీ వచ్చి తనపేరు రాజీవ్ వెనకాల అంటూ స్కిట్ ప్రారంభించాడు.
Advertisement
వెనకాల అంటే సుమ ఎప్పుడూ సినిమా ఆడియో ఫంక్షన్ లు చేస్తుంటే వెనకాల రాజీవ్ వెళ్లి వెతుకుతారు అంటూ చెప్పాడు. ఆ వెంటనే ఈ స్కిట్ కు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ సుమ తన భర్తకు చెప్పింది. ఇక ఆ తరవాత తాగుబోతు రమేష్ సుమ గెటప్ లో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు. తాగుబోతు రమేష్ తన గెటప్ వేసినా తాగినట్టే ఉందంటూ సుమ పంచ్ లు వేసింది. ఇక జడ్జీ రోజా సుమను గారు అని సంబోదించడంతో మీరేంటి నన్ను గారు అని సంబోధిస్తున్నారు.
మీకంటే నేను పదిహేనేళ్లు చిన్నదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. దాంతో నేను ఇండస్ట్రీకి హీరోయిన్ గా వచ్చినప్పుడు సుమ కూడా హీరోయిన్ గా వచ్చింది అంటూ రోజా సుమ పరువు తీసేసింది. దాంతో సుమ కూడా నోరు మొదపకుండా ఉండిపోయింది. ఇక రాకెట్ రాఘవ కూడా ప్రోమోలో సుమ సినిమాపై తన దైన స్కిట్ చేసి ఆకట్టుకున్నాడు. సుమ ఇంకా షోలో ఏం ఏం చేసింది…ఎలా జోకులు పేల్చింది అనేది తెలియాలంటే షో చూడాల్సిందే.